2.0 మేకింగ్ వీడియో లీక్.. కళ్ళు చెదిరేలా అమీజాక్సన్!
సూపర్ స్టార్ రజినీకాంత్ 2.0 చిత్ర వాయిదాల పర్వం కొనసాగుతూనే ఉంది. గత ఏడాది దీపావళికే విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడుతూనే ఉంది. ఎప్పుడు విడుదలవుతుందనే విషయంలో కూడా క్లారిటీ లేదు. తాజగా ఈ చిత్రానికి సంబందించిన మేకింగ్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చిత్ర యూనిట్ సభ్యులకు తెలియకుండా లీకై ఉంటుందని భావిస్తున్నారు.
ఈ వీడియోలో అమీ జాక్సన్ పై సాంగ్ చిత్రీకరిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నారు. అమీ జాక్సన్ గెటప్ కొత్తగా, లేడి రోబోని తలపించేలా ఉంది. సరి కొత్త టెక్నాలజీతో 2.0 చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 3డి కెమెరాలతో హాలీవుడ్ టెక్నీషియన్స్ పర్యవేక్షణలో షూటింగ్ జరుగుతోంది.

2.0 చిత్రం భారతీయములకు సరి కొత్త సినిమాటిక్ అనుభూతి కలిగిస్తుందని అంటున్నారు. ఈ చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ ఏస్థాయిలో ఉండబోతున్నాయో ఈ వీడియో చూస్తే అర్థం అవుతుంది. శంకర్ విజన్ కు అనుగుణంగా విజువల్ ఎఫెక్ట్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల ఆలస్యం అవుతుందనే వార్తలు వస్తున్నాయి.


Click it and Unblock the Notifications











