రజనీకాంత్ మళ్లీ తాత అవుతున్నారు
చెన్నై : రజనీకాంత్ మరోసారి తాత కాబోతున్నారు. ఆయన చిన్న కుమార్తె సౌందర్య ఆర్.అశ్విన్...గర్బవతి అని త్వరలో ఓ బిడ్డకు జన్మ ఇవ్వబోతోంది. సౌందర్యకు 2010లో బిజినెస్ మ్యాన్ అశ్విని రామ్ కుమార్ తో వివాహం అయ్యింది.
సౌందర్య కొచ్చాడియన్(విక్రమ్ సింహా)తో దర్శకురాలిగా ఈ సంవత్సరం మారారు. అయితే చిత్రం టెక్నికల్ గా మంచి పేరు వచ్చినా బిజినెస్ పాయింటాఫ్ వ్యూలో డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం ఆమె ఈరోస్ వారి డిజిటల్ ఇన్నోవేషన్ కి క్రియేటివ్ ప్రాజెక్టు డైరక్టర్ గా పనిచేస్తున్నారు.

ఇక రజనీ తాజా చిత్రం లింగా ఈ వారమే రిలీజైంది. తమిళ, తెలుగులలో నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో రజనీ ద్విపాత్రాభినయం చేసారు. భారీ అంచనాలతో వచ్చిన ఈ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ అయ్యి అభిమానులను నిరాశలో ముంచింది.


Click it and Unblock the Notifications











