Rajinikanth: రజనీకాంత్‌ కెరీర్ లో ఓ మాయని మచ్చ! సౌత్ సెన్సేషన్‌తో తలైవా వివాహేతర సంబంధం?

Rajinikanth: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. ఓ సామాన్య కుటుంబంలో పుట్టి బస్ కండక్టర్ గా కెరీర్ ను ప్రారంంచారు. ఆ తరువాత స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఓ సామాన్య నటుడు నుంచి సూపర్ స్టార్ రజినీకాంత్ అంచెలంచెలుగా ఎదుగుతూ.. శిఖరమంతా కీర్తిని సంపాదించి తన ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసుకున్న నటుడు రజనీకాంత్. ఆయన తన నట ప్రస్థానంలో ఎన్నో అవార్డులు, సత్కారాలు, ప్రశంసలు పొందారు. అయితే ఈ మహానటుడి తన కెరీర్ లో మచ్చ లాంటి వివాదం అప్పుడప్పుడు తెరపైకి వస్తూనే ఉంటుంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ?

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. 'తలైవార్' అంటూ ఆయనను కీర్తిస్తూ ఉంటారు. ఆయన తన కెరీర్ లో ఎన్నో విజయాలను అందుకున్నారు. భారతదేశ సినీ చరిత్రలో అత్యధిక విజయాలు అందుకున్న నటులలో రజనీకాంత్ ఒక్కరు. కర్ణాటకలో ఓ మరాఠా కుటుంబంలో జన్మించిన శివాజీ రాజ్ గైక్వాడ్.. చిన్నతనం నుండి నటనపై ఆసక్తి కనబరిచారు. సమయం దొరికినప్పుడల్లా నాటకాలలో పాల్గొనేవారు. కానీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు సరిగా లేకపోవడంతో కండక్టర్ గా జీవితాన్ని ప్రారంభించాల్సి వచ్చింది.

Rajinikanth and Silk Smitha between extramarital affair rumors circulated in the film industry

కానీ స్నేహితుల ప్రోత్సాహంతో మద్రాస్ కెళ్ళి సినిమాలలో అవకాశాల కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న వాటిని అధిగమిస్తూ వెండితెరపై మెరిసారు. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఎదిగారు. ఎన్నో తిరుగులేని విజయాలను అందుకున్న రజనీకాంత్ కెరీర్లో ఎన్నో సత్కారాలు ఎన్నో విజయాలు ఎన్నో..అయితే రజనీకాంత్ తన ఐదు దశాబ్దాల నట ప్రస్థానంలో ఓ బి గ్రేడ్ నటిని ప్రేమించారని, ఆమెతో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారంటూ పుకార్లు జోరుగా వినిపించాయి.

ఇండస్ట్రీలో ఇంత పెద్ద నటుడైనా ఎవరో ఒకరితో అఫైర్స్ ఉన్నట్లు వార్తలు రావడం సహజమే. కానీ, సౌత్ సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగొందుతున్న నటుడు రజనీకాంత్.. ఓ బి గ్రేడ్ హీరోయిన్ సిల్క్ స్మిత తో ప్రేమాయణం కొనసాగించారంటూ అప్పట్లో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో సిల్క్ స్మితకు ఉన్న ఫాలోయింగ్ మామూలుది కాదు. ఆనాడే రజనీకాంత్, కమల్ హాసన్ వంటి స్టార్ హీరోలతో పోటీపడి నటించేది. అలాంటి అమ్మడుతో రజనీకాంత్ ప్రేమలో పడ్డారని ప్రచారం జోరుగా సాగింది.

వీరిద్దరూ కలిసి శివప్పు సూరియన్, జీత్ హమారీ, తంగా మగన్, పాయుమ్ పులి వంటి అనేక చిత్రాలలో కలిసి నటించారు. దీంతో సిల్క్ స్మిత ఓవర్ నైట్ స్టార్ యాక్టర్ గా మారిపోయింది. హీరోలను సైతం బీట్ చేసే పాపులారిటీని సంపాదించుకుంది. సిల్క్ స్మిత బికినీలు, స్విమ్స్ షూస్ వేసుకొని వెండితెరపై మెరిసే బోల్డ్ హీరోయిన్ గా బి గ్రేడ్ హీరోయిన్గా ముద్ర వేసుకుంది. ఈ అమ్మడు ముఖ్యంగా వ్యాంపు, ఐటం సాంగ్స్ లలో ఎక్కువగా నటించేది.

Rajinikanth and Silk Smitha between extramarital affair rumors circulated in the film industry

ఓ సినిమా షూటింగ్ సమయంలో సిల్క్ స్మిత తో రజనీకాంత్ రొమాంటిక్ డాన్స్ చేయడం, అందులో వారు ఇద్దరు రెచ్చిపోయి నటించడంతో వారి మధ్య ఏదో ఉందంటూ ప్రచారం జోరుగా సాగింది. ఈ సమయంలో సిల్క్ స్మిత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తాను తలైవా ప్రేమలో పడ్డానని, అతనంటే ఇష్టం అంటూ పరోక్షంగా కామెంట్స్ చేసింది. దీంతో వీరి మధ్య విడదీయలేని సంబంధం ఉందంటూ తమిళ పత్రికలలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. కానీ ఈ పుకార్లపై రజనీకాంత్ ఏనాడు కూడా స్పందించలేదు.

స్టార్ హీరోలకు సైతం పోటీగా నిలిచిన సిల్క్ స్మిత జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూసింది. ఆనాడే భారీ మొత్తంలో రెమ్యూనరేషన్ తీసుకున్న ఈ బోల్డ్ బ్యూటీ ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. రీల్ లైఫ్ లో ఎన్నో విజయాలను అందుకున్న సిల్క్ స్మిత.. రియల్ లైఫ్ లో మాత్రం ఘోర పరాజయాలను అందుకొని కుంగిపోయింది. దీంతో 1996లో ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయింది. ఆత్మహత్యకు సరైన కారణం ఏంటో ఇప్పటికీ తెలుగు రాలేదు. కానీ, సిల్క్ స్మిత మరణం వెనక రజనీకాంత్ ఉన్నారంటూ ఓ నింద అప్పట్లో వచ్చింది. ఇందులో ఎంత నిజమొందో వారికే తెలియాలి.

More from Filmibeat

Read more about: rajinikanth silk smitha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X