Don't Miss!
- Finance HUL: రూ.24 డివిడెండ్ ప్రకటించిన హిందుస్థాన్ యూనిలీవర్..
- News వివేకా కేసులో మరో అనూహ్య ట్విస్ట్- విచారణ నుంచి తప్పుకున్న జడ్జి..!
- Automobiles కొత్త ఆస్టన్ మార్టిన్ వాంటేజ్ కూల్ స్పోర్ట్స్ కారు లాంచ్.. గంటకు 325 కి.మీ వేగం.. ధర, ఫీచర్లు ఇవే..
- Technology Nokia మాతృ సంస్థ HMD నుంచి మూడు కొత్త ఫోన్లు లాంచ్! ధర, స్పెసిఫికేషన్ల వివరాలు
- Sports సూపర్‌మ్యాన్ స్టబ్స్: మెరుపు ఫీల్డింగ్‌తో ఢిల్లీని గెలిపించాడు! Video
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
‘అన్నత్తే’ షూటింగ్ స్పాట్ ఫొటో వైరల్: అదిరిపోయే గెటప్‌లో సూపర్ స్టార్ రజినీకాంత్
వయసు పెరుగుతున్నా మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తూ.. కుర్ర హీరోలకే సవాలు విసురుతున్నారు తలైవా సూపర్ స్టార్ రజినీకాంత్. ఆరు పదుల వయసులోనూ ఎంతో వేగంగా చిత్రాలను చేస్తూ.. తన అభిమానులను ఖుషీగా ఉంచుతున్నారు. జయాపజయాలను పట్టించుకోని ఆయన.. ఒకదాని తర్వాత ఒకటి పట్టాలెక్కిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఆయన 'అన్నత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా షూటింగ్ స్పాట్ నుంచి ఓ ఫొటో బయటికొచ్చింది. ఇది చూసిన వారంతా షాకవుతున్నారు.
తమిళ సినీ ఇండస్ట్రీలో మాస్ చిత్రాల దర్శకుడిగా పేరొందిన శివ డైరెక్షన్లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తోన్న చిత్రమే 'అన్నత్తే'. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రస్తుతం దీని షూటింగ్ హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివతో రజినీకాంత్ మాట్లాడుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇందులో తలైవా వింటేజ్ గెటప్‌తో కనిపించారు. దీంతో ఈ సినిమాలో ఆయన లుక్ ఇదే అని అందరూ అనుకుంటున్నారు. ఇక, ఈ పిక్ బయటకు వచ్చినప్పటి నుంచి రజినీ అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోతున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'అన్నత్తే' సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో రజినీకాంత్ మధ్య వయస్కుడి పాత్రను పోషిస్తున్నారు. ఆయన కుమార్తెగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.