twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రజనీకాంత్‌కు సమన్లు.. కాల్పుల ఘటన వివాదంలో సూపర్‌స్టార్ రియాక్షన్ ఏమిటంటే

    |

    తమిళనాడులో తూతుకుడిలోని స్టెరిలైట్ ప్లాంట్ వద్ద 2018లో నిరసన చేపట్టిన ఆందోళనకారులపై కాల్పులు జరిపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రస్తుతం ఆ వివాదం సూపర్‌స్టార్ రజినీకాంత్‌ను ఇరుకునపెట్టే ప్రయత్నం జరుగుతున్నది. ఈ కాల్పుల ఘటన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లిన రజనీకాంత్ మాట్లాడుతూ బాధితుల పక్షాన నిలిచారు. ఆ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి.

    దాంతో ఆ వివాదంపై ఏర్పాటు చేసిన అరుణా జగదీశన్ నేతృత్వంలోని కమిటీ రెండుసార్లు సమన్లు జారీ చేసింది. అయితే రెండుసార్లు కూడా కమిషన్ ముందు రజినీ హాజరుకాలేదు. కానీ లిఖితపూర్వకమైన సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో తాజాగా కమిటీ సభ్యులు రజనీకాంత్‌కు 15 ప్రశ్నలతో కూడిన లేఖను పంపించగా వాటికి సమాధానాలు తెలిపినట్టు సమాచారం.

    Rajinikanth answer to 15 questions posed by Aruna Jagadeesan commission in Thoothukudi firing

    ఇటీవల రజనీకాంత్ సమర్పించిన సమాధానాలను త్వరలోనే తమిళనాడు ప్రభుత్వానికి అరుణా జగదీశన్ కమిటీ సభ్యులు అందజేసే అవకాశం ఉంది. అయితే రజనీ సమాధానాలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తూందో వేచి చూడాల్సిందే.

    ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లోని రామోజీ ఫిలింసిటీలో జరుగుతున్న అన్నాతే షూటింగులో బిజీగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు పొందిన అన్నాతే టీమ్ తెలంగాణలో నైట్ కర్ప్యూ సమయంలో కూడా షూటింగు చేస్తుండటం విశేషం. అంతా సవ్యంగా సాగితే.. ఈ చిత్రం దీపావళికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

    English summary
    Tamil Super Star Rajinikanth answer to 15 questions posed by Aruna Jagadeesan commission in Thoothukudi firing.Commission will submit the answers to the Tamil nadu government soon. Meanwhile, Rajinikanth is busy with Annaathe shoot.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X