మెగా స్టార్ రీ ఎట్రీకి అభినందలు తెలిపిన సూపర్ స్టార్...!?
ఈ నెల 24న విడుదల కానున్న 'రోబో" చిత్రం సూపర్ హిట్ కావాలని ఆ వెంకటేశ్వరుడ్ని కోరుకున్నట్లు చెప్పారు దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్. గురువారం రాత్రి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాలో మాట్లాడుతూ చిరంజీవి మళ్లీ సినిమాలు చేసేందుకు ముందుకు రావటం తనకి ఎనలేని ఆనందాన్ని ఇస్తోందని ఆయన ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోయే కథానాయకుడంటూ ప్రశంసలు కురిపించారు.
తన రోబో చిత్రం విభిన్న కథాంశమని శంకర్ ప్రతిభ ప్రతి ఫ్రేంలో కనిపిస్తుందని భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం హిట్ కావాలనే తాను ఆ దేవదేవుడ్ని ప్రత్యేకంగా కోరుకున్నానని చెప్పారాయన. రోబో తరువాత సుల్తాన్ లో యానిమేటెడ్ రజనీని సరికొత్తగా చూస్తారని అన్నారు రజనీకాంత్. రజనీతో పాటు శ్రీవారిని దర్శించుకున్న వారిలో ఆయన భార్య ఇటీవల పెళ్లైన ఆయన రెండవ కుమార్తె సౌందర్య, అల్లుడు అశ్వనీకుమార్ ఉన్నారు.
రజనీకాంత్ రోబో ఐశ్వర్య రాయ్ శంకర్ కళానిధి మారన్ ఎఆర్ రెహమాన్ చిరంజీవి సుల్తాన్ rajinikanth robo aishwarya rai shankar kalanidhi maran ar rahman chiranjeevi sulthan


Click it and Unblock the Notifications