రజనీ మామయ్య మెచ్చిన అల్లుడు: ధనుష్!
జెమిని ఫిల్మిం సర్క్యూట్ లో మిత్రన్ జవహార్ దర్శకత్వంలో రజినీకాంత్ అల్లుడు ధనుష్ హీరోగా నటించిన చిత్రం 'కుట్టి". ఈ చిత్రం తెలుగు సినిమా ఆర్య చిత్రానికి రీమేక్, ఈ చిత్రం తనకు మంచి విజయాన్ని ఇచ్చింది. ఈ చిత్రంలో కొన్ని సన్నివేశాలు తన నిజజీవితానికి దగ్గరగా ఉన్నాయని చెబుతున్నాడు ధనుష్. సినిమాలోనికి రాక ముందు ఒక అమ్మాయిని ఎంతో ఇష్టంగా ప్రేమించిన ధనుష్, ఆ అమ్మాయి విదేశాలకు వెళ్లి పోవడంతో తన ప్రేమను చంపుకుని సినిమాలోనికి ప్రవేశించిన ధనుష్, తర్వాత ప్రేమ గురించి ఏమి ఆలోచించలేదట. ఈసినిమా చేసేప్పుడు ధనుష్ కు తన పాత జ్ఝాపకాలు కొన్ని గుర్తుకు వచ్చాయట.
నేను రజినీకాంత్ అల్లుడిని కాదు. అంతకంటే ముందు కస్తూరి రాజా వారసుడిని అని చెప్పిన మాటలకు మామయ్యగారు పిలిచి మరీ అభినందించారు. ప్రతి మనిషికి స్వతహాగా ఈ విధమైన నమ్మకం ఉండాలి. ఎవరినో నమ్ముకో కూడదు అని రజిని తెలిపినట్టు ధనుష్ తెలియజేశాడు. పాత్రకు సరిపడ హీరోయిన్లను దర్శకనిర్మాతలు సెలక్ట్ చేసుకుంటారు కానీ, నేను కాదు అంటూ తనపై ప్రముఖ హీరోయిన్లతో నటించాలని కోరుకుంటున్నట్టు వస్తున్న అభియోగాలను తోసిపుచ్చాడు ధనుష్.


Click it and Unblock the Notifications











