రజనీ కాంత్ మెచ్చుకుని హీరోకు ప్రశంసాపత్రం

By Srikanya

చెన్నై : ప్రభు కుమారుడు విక్రంప్రభు హీరోగా నటించిన రెండోచిత్రం 'ఇవన్‌ వేరమాదిరి'. 'ఎంగేయుం ఎప్పోదుం' ఫేం శరవణన్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా విక్రంప్రభుకు పేరు తెచ్చిపెట్టింది. తిరుపతి బ్రదర్స్‌ బ్యానరుపై లింగుస్వామి నిర్మించిన ఈ సినిమాను సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తాజాగా చూశి మెచ్చుకున్నారు. దాంతో హీరో విక్రం ప్రభు మురిసిపోతున్నాడు.

సినిమా చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను మెచ్చుకున్నారు. అనంతరం విక్రంప్రభుకు ప్రశంసాపత్రాన్ని కూడా పంపించారట. 'ఇది క్లాస్‌, మాస్‌ కలగలసిన చిత్రం. ఏ సినిమాలోనూ లేని కీలక సన్నివేశాలు ఇందులో చూసి ఆశ్చర్యపోయా. మంచి కాలక్షేప చిత్రం కూడా. విజయవంతమైన ఈ సినిమాకు నా అభినందనలు తెలియజేస్తున్నాను''అని అందులో పేర్కొన్నారు.

Rajinikanth appreciated Ivan Veramathiri
ఇక సౌతిండియా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన 'కోచ్చడయాన్' (తెలుగులో 'విక్రమసింహా') సినిమా విడుదల మరింత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. ఆయన కుమార్తె సౌందర్య దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో వేడుక నిజానికి రజనీకాంత్ జన్మదినం సందర్భంగా గురువారం (డిసెంబర్ 12) జరగాల్సి ఉంది. కానీ ఆ వేడుకను కూడా జనవరి మొదటి వారానికి వాయిదా వేశారు.

ఈ సంగతిని తమిళ ఫిల్మ్ ట్రేడ్ విశ్లేషకుడు శ్రీధర్ పిళ్లై ట్విట్టర్ ద్వారా తెలియజేసారు. శ్రీధర్ పిళ్లై ట్వీట్ లో ... "ఈ సినిమా విడుదల 2014 ఏప్రిల్‌కు మారింది'' అని చెప్పారు. దీపికా పడుకోనే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో శరత్‌కుమార్, జాకీ ష్రాఫ్, ఆది పినిశెట్టి, శోభన, నాజర్ వంటి పేరుపొందిన తారలు నటిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్' తరహాలో మోషన్ కాప్చర్ 3డి టెక్నాలజీని ఉపయోగించి చిత్రీకరించారు. కె.ఎస్. రవికుమార్ రచన చేయగా, ఎ.ఆర్. రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి రాజీవ్ మీనన్ సినిమాటోగ్రాఫర్. తెలుగులో లక్ష్మీగణపతి ఫిలిమ్స్ విడుదల చేస్తున్న ఈ సినిమాని హిందీ, మలయాళం, ఇంగ్లీష్, జపనీస్ భాషల్లోనూ అనువదిస్తున్నారు.

'రోబో' తర్వాత రజనీకాంత్‌ హీరోగా 'రాణా' చిత్రం తెరకెక్కాల్సింది. ఆయన అనారోగ్యానికి గురికావటంతో అది ఆగిపోయింది. తన చిన్న కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచ్చడయాన్‌'కు పచ్చజెండా వూపి అభిమానులను ఖుషీ చేశారు సూపర్‌స్టార్‌. సీనియర్‌ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ పర్యవేక్షణలో అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిందీ చిత్రం. ఇందులో రాణా, కోచ్చడయాన్‌గా రజనీకాంత్‌ ద్విపాత్రాభినయం చేశారు. ఇప్పటికే ట్రైలర్‌ విడుదల చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X