డబ్బుపై అధికారుల నిఘా నేత్రం, అందుకే రజనీకాంత్ మూవీ వాయిదా?

Recommended Video

Interesting News On Super Star Rajini Kanth New Movie | A.R.Murugadoss | Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ వయసు 70 ఏళ్లకు చేరువవుతున్నా ఏ మాత్రం అలుపు లేకుండా వరుస సినిమాలకు కమిట్ అవుతున్నారు. రజనీకాంత్ హీరోగా నటించిన 'పేట' చిత్రం సంక్రాంతి సందర్భంగా విడుదలై బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే.

'పేట' తర్వాత రజనీకాంత్ నెక్ట్స్ మూవీ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందబోతోంది. ఈ మూవీ షూటింగ్ మార్చిలోనే మొదలవ్వాల్సి ఉండగా పలు కారణాలతో ఇంకా మొదలు కాలేదు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10 నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

డబ్బుపై అధికారుల నిఘా నేత్రం

డబ్బుపై అధికారుల నిఘా నేత్రం

ఎన్నికల సమయం కావడంతో బ్యాంకుల నుంచి విత్ డ్రా అయ్యే డబ్బుపై అధికారులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. భారీ మొత్తంలో డబ్బు ఎక్కడ లభించినా వెంటనే సీజ్ చేస్తున్నారు. ఈ కారణంగానే బిగ్ బడ్జెట్ సినిమాల ప్రారంభం ఆగిపోయినట్లు తెలుస్తోంది.

ఖాకీ దుస్తుల్లో రజనీకాంత్

ఖాకీ దుస్తుల్లో రజనీకాంత్

కాగా.. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంలో రజనీకాంత్ మళ్లీ ఖాకీ దుస్తుల్లో కనిపిస్తారని టాక్. ఈ విషయంలో చిత్ర బృందం నుంచి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.

ఇద్దరు హీరోయిన్లు

ఇద్దరు హీరోయిన్లు

ఇంకా టైటిల్ ఖరారు కాని ఈ చిత్రంలో నయనతార, కీర్తి సురేష్ హీరోయిన్లుగా ఎంపికైనట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన తారాగణం, టెక్నీషియన్ల వివరాలు త్వరలో ప్రకటించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు.

భారీ అంచనాలు...

భారీ అంచనాలు...

రజనీకాంత్ సినిమా అంటేనే క్రేజ్ ఓ రేంజిలో ఉంటుంది. అందులోనూ ఏఆర్ మురుగదాస్ లాంటి స్టార్ డైరెక్టర్ తీస్తున్న చిత్రం కావడంతో ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X