మురుగదాస్ మూవీ: రజనీకాంత్ టెర్రిఫిక్ లుక్ ముందే లీకైంది!

Recommended Video

Rajini Kanth Cop Look Revealed From His Upcoming Movie #thalaivar167 || Filmibeat Telugu

రజనీకాంత్ ఇండస్ట్రీకి వచ్చిన దాదాపు 45 సంవత్సరాలపైనే అవుతోంది. ఇన్నేళ్లయినా ఆయన తన సూపర్ స్టార్ ఇమేజ్ చెక్కుచెదరకుండా మెయింటేన్ చేస్తున్నారు. ప్రతి సినిమాకు తనను తాను సరికొత్తగా వెండితెరపై ప్రజంట్ చేసుకుంటూ ఎవరూ టచ్ చేయలేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ఇటీవలే 'పేట'తో భారీ విజయం అందుకున్న రజనీకాంత్... తన తర్వాతి సినిమాను ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ చిత్రంలో రజనీ డ్యూయోల్ రోల్ చేస్తున్నారు. ఒక పాత్రలో పోలీస్‌గా, మరో పాత్రలో సామాజిక కార్యకర్తగా కనిపించబోతున్నారు.

రజనీకాంత్ లుక్ లీక్

రజనీకాంత్ లుక్ లీక్

ఈ చిత్రానికి సంబంధించి రజనీకాంత్‌ పోలీస్ మ్యాన్ లుక్ లీకైంది. ఈ లీక్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చెన్నైలోని ఓ పాపులర్ స్టూడియోలో రజనీపై ఇటీవల ఫోటో షూట్ చేశారని, అక్కడి నుంచే ఈ లుక్ లీకైనట్లు సమాచారం.

షేర్ చేయవద్దంటూ విజ్ఞప్తి.. కానీ అప్పటికే

షేర్ చేయవద్దంటూ విజ్ఞప్తి.. కానీ అప్పటికే

అయితే ఈ లుక్ లీక్ అవ్వగానే రజనీకాంత్ ప్రతినిధి ఒకరు అభిమానులను రిక్వెస్ట్ చేస్తూ స్టేట్మెంట్ విడుదల చేశారు. సూపర్ స్టార్ లుక్ అఫీషియల్‌గా విడుదలయ్యే వరకు ఎవరూ దాన్ని షేర్ చేయవద్దని, అంత వరకు అందరూ ఓపిక పట్టాలని కోరారు. అయితే అప్పటికే ఈ ఫోటోలు సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయిపోయాయి.

ఈ నెలలోనే మొదలు, నయనతార కూడా

ఈ నెలలోనే మొదలు, నయనతార కూడా

చెన్నై సినీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 10 నుంచి ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మొదలు కాబోతోందని టాక్. ఇందులో నయనతార కీలకపాత్రలో కనిపించబోతోంది. ఇంతకు ముందు ఆమె సూపర్ స్టార్‌తో కలిసి చంద్రముఖి, కుచేలన్, శివాజీ చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే.

తలైవార్ 167

తలైవార్ 167

ప్రస్తుతం ఈ ప్రాజెక్టును ‘తలైవార్ 167' అని పిలుస్తున్నారు. ప్రముఖ టెక్నీషియన్ సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అఫీషియల్ సమాచారం బయటకు రాలేదు. వచ్చే ఏడాది సంక్రాంతి సమయానికి థియేటర్లలోకి తెచ్చేలా షూటింగ్ ప్లాన్ చేస్తున్నారట.

లీకైన లుక్ ఇదేనా?

లీకైన లుక్ ఇదేనా?

తాజాగా లీకైన ఫోటోల మీద ‘166' అని ఉండటంతో చాలా మంది కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఇది రజనీకాంత్ కెరీర్లో చేస్తున్న 167 మూవీ కావడమే ఇందుకు కారణం. ఈ లీక్ పిక్ విషయంలో చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సి ఉంది

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X