14న చెన్నైకి రానున్న తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్
ప్రముఖ కథానాయకుడు రజనీకాంత్ ఆరోగ్యం గత కొన్నాళ్లుగా బాగోలేని విషయం తెలిసిందే. మెరుగైన వైద్యం కోసం ఆయన సింగపూర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం వేగంగా కోలుకొంటున్న నేపథ్యంలో ఈ నెల 14న చెన్నైకి తిరిగి రానున్నారని ఆయన అల్లుడు, నటుడు ధనుష్ తెలిపారు. గురువారం రాత్రి సింగపూర్ నుంచి చెన్నైకి చేరుకున్న ధనుష్ ఓ తమిళ పత్రికతో మాట్లాడుతూ.. సూపర్‌స్టార్ ఆరోగ్యం కుదుటపడిన కారణంగానే తాను సింగపూర్ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చినట్లు వివరించారు.
అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ రాణా సినిమాలో నటించడానికి మొదటి విడతగా ఆయనకు 24 కోట్ల రూపాయలు చెల్లించారు. రజీనీకాంత్ దేశంలో అత్యంత ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే నటుడని, ఆయన 24 కోట్ల రూపాయలు పొందడంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు వాటా కూడా తీసుకున్నారని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టులో రజనీ రెండో కూతురు సౌందర్య భాగస్వామి కూడా. రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను పెళ్లి చేసుకున్న నటుడు ధనుష్ ఆ కుటుంబానికి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు. రజనీకాంత్ ఆరోగ్యం గురించి ఆయనే ప్రకటనలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











