»   » స్టంట్ మాస్టర్ కూతురు వివాహానికి రజనీకాంత్ (ఫోటోలు)

స్టంట్ మాస్టర్ కూతురు వివాహానికి రజనీకాంత్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

చెన్నై: సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుండి సూపర్ స్టార్‌గా ఎదిగిన రజనీకాంత్ ఎప్పుడూ సామాన్యుడిగానే తన జీవితం నిరాడంబరంగా సాగిస్తూ ఉంటారు. తనతో పాటు పని చేసిన వారికి ఆయన ఎంతో గౌరవం ఇస్తుంటారు. తాను చేయగలింది అయితే ఏలాంటి సహాయం అయినా చేయడానికి వెనకాడరు. టాలెంటుతో పాటు ఆయనకు ఉన్న మంచి సుగుణాలే ఆయన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళ్లాయి.

అదే విధంగా తనను అభిమానించే వారు ఏదైనా కార్యక్రమానికి ఆహ్వానిస్తే....ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ కార్యక్రమానికి వెళ్లడానికి ప్రయత్నిస్తారు రజనీ. తనతో పాటు పలు సినిమాలకు స్టంట్ మాస్టర్‌గా పని చేసిన కిట్టు అనే కళాకారుడు తన కూతురు వివాహానికి ఆహ్వానించడంతో రజనీకాంత్ హాజరయ్యారు. కిట్టు కూతురును ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమానికి రజనీకాంత్‌తో పాటు తమిళ నటుడు ప్రభు, మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోలు....

రజనీకాంత్

రజనీకాంత్


స్టంట్ మాస్టర్ కిట్టు కూతురు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న రజనీకాంత్

రజనీని తీసుకొస్తున్న కిట్టు

రజనీని తీసుకొస్తున్న కిట్టు


తాను పిలవగానే వెంటనే హాజరైన రజనీకాంత్‌ను వివాహ వేదికకు తీసుకొస్తున్న స్టంట్ మాస్టర్ కిట్టు.

నిరాడంబరంగా...

నిరాడంబరంగా...


రియల్ లైఫ్‌లో ఎంతో నిరాడంబరంగా ఉంటారు రజనీకాంత్. ఈ పెళ్లి వేడుకకు కూడా ఆయన ఎంతో సింపుల్‌గా హాజరయ్యారు.

ప్రభు

ప్రభు


స్టంట్ మాస్టర్ కూతురు వివాహాజినిక హాజరైన తమిళ నటుడు ప్రభు. నూతన వధూవరులకు శుభాకాంక్షులు చెబుతున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

English summary
Tamil film Stunt Master Kittu daughter Marriage Reception held at Chennai. Rajinikanth, Prabhu, Bharadhi Raja, Chithra Lakshmanan, Suman, S.P.Muthuraman wished the couples.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu