»   » ఆస్తుల మీద ఆసక్తి లేదు, అప్పుడే దూరం కావాల్సింది: రజనీకాంత్

ఆస్తుల మీద ఆసక్తి లేదు, అప్పుడే దూరం కావాల్సింది: రజనీకాంత్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆస్తులు, హోదా మీద తనకు అంత పెద్దగా ఆసక్తి లేదని... నిరాడంబరంగా ఆధ్యాత్మిక వాదిగా జీవించడమే తనకు ఇష్టమని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. తాను ఓ నటుడిని అని చెప్పుకోవడం కంటే... ఆధ్యాత్మిక వాదిని అని చెప్పుకోవడానికి ఇష్టపడతానని ఆయన తెలిపారు.

చెన్నైలో జరిగిన పరమహంస యోగానంద రచించిన 'దైవీగ కాదల్‌' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రజనీకాంత్ ఈ వ్యాఖ్యలు చేసారు. ఈ సందర్భంగా రజనీకాంత్‌ మాట్లాడుతూ ఆస్తులు, హోదా కంటే ఆధ్యాత్మికతను స్వీకరించడానికే తాను ఇష్టపడతానని తెలిపారు. ఆధ్యాత్మికంలోనే ఎక్కువ 'శక్తి' ఉందన్నారు.

rajinikanth

'పడయప్పా' (నరసింహా) చిత్రం తర్వాత నటించకూడదనుకున్నాను. కానీ బాబా గురించిన విశేషాలు ప్రజలకు చెప్పాలన్న ఉద్దేశంతో 'బాబా'లో మళ్లీ నటించానని రజనీకాంత్ తెలిపారు. ఆ సినిమా పెద్దగా ఆడక పోయినా ఆవేదన చెందలేదన్నారు.

బాబా సినిమా భారీగా నష్టాలు తేవడంతో.... రజనీకాంత్ డిస్ట్రిబ్యూటర్లకు తన సొంత డబ్బు ఇచ్చి ఆదుకున్నారు. ఆ సినిమా నష్టాల నుండి బయట పడటానికి మళ్లీ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయారు రజనీకాంత్. ప్రస్తుతం రజనీకాంత్ రోబో 2.0 చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

English summary
“More than an actor, I am proud to be known as a spiritually-inclined person,” said superstar Rajinikanth at the launch of the Tamil translation of the book ‘The Divine Romance’ by Paramahansa Yogananada on Saturday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu