హౌస్ ఫుల్స్ తో రజనీకాంత్ 'భాషా'

By Srikanya

"ఈ భాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్లు"అంటూ రజనీకాంత్ చెప్పే డైలాగుని మరిచిపోవటం కష్టమే. రజనీకాంత్ ఎవర్ గ్రీన్ చిత్రం భాషా ని మరో సారి నవంబర్ 4న చెన్నైలో విడుదల చేసారు. 1995 జనవరి 12 న విడుదలైన ఈ సినిమా అప్పట్లో పెద్ద సంచలనం. కేవలం పది కోట్ల వ్యయంతో తీసిన ఈ చిత్రం దాదాపు యాభై కోట్ల వరకూ వసూలు చేసి రికార్డులు సృష్టించింది. అంతేగాక ఈ చిత్రం తెలుగులోనూ మెగా హిట్టైంది. చెన్నైలో నాలుగు ధియేటర్లలో విడుదలైన ఈ చిత్రం మొదటి రోజునుంచీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో సాగుతోంది. రజనీ ఫ్యాన్స్ ఆ ధియోటర్స్ వద్ద భారీగా హోర్డింగ్స్ పెట్టి హంగామా చేసారు. రజనీ చిత్రం రావటానికి చాలా గ్యాప్ పట్టేడట్లు ఉండటంతో ఇలా చేసారు.

ఇక రజనీ గెస్ట్ గా చేసిన రావన్ చిత్రం మాత్రం తమిళనాడులో అస్సలు ఆడలేదు.మినిమం వసూళ్లను కూడా సాధించలేకపోయింది. డిజిటలైజ్ చేసిన వెర్షన్ లో విడుదల చేసిన ఈ చిత్రం వసూళ్లును చూసిన ట్రేడ్ పండితలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక రజనీ మిగతా సూపర్ హిట్ సినిమాలను కూడా ఇలా డిజటలైజ్ చేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి భాషా సంచలనం మరోసారి రజనీ స్టామినా ఏంటో చూపెట్టింది. దక్షిణాది సూపర్ స్టార్ అనే బిరుదుని సార్దకం చేసిందని అక్కడ పత్రికలు రాస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X