బాషా ఒక్కసారి చెబితే..100సార్లు చెప్పినట్లే!
తాజాగా 'బాషా' చిత్రం ఈ సమ్మర్లో మరోసారి రీరిలీజ్ కాబోతోంది. వీడియో, ఆడియో పరంగా మరిన్ని మెరుగులు దిద్ది ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈచిత్రం కోసం రజనీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఓ దుష్టశక్తి బారి నుంచి ప్రపంచాన్ని రక్షించే పోరాట యోధుడిగా రజనీకాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన 30 ఏళ్ల యువకుడిగా కనిపిస్తాడు. ఆయన తక్కువ వయసు వాడిలా కనిపించడం కోసం అధునాతన టెక్నాలజీని వాడుతున్నారట.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే 'ఖడ్గ రుద్ర' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications












