twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాషా ఒక్కసారి చెబితే..100సార్లు చెప్పినట్లే!

    By Bojja Kumar
    |

    బాషా ఒక్కసారి చెబితే..100సార్లు చెప్పినట్లే!.....ఈ పాపులర్ డైలాగ్ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ 'బాషా' చిత్రంలోనిది అని కొత్తగా చెప్పాల్సిన పని లేదనుకుంటా. 1995లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అప్పట్లో భారీ విజయం సాధించింది. రజనీకాంత్ సీని చరిత్రలో ఈ చిత్రం ఓ మైలురాయి. ఈచిత్రంలో రజనీ మేనరిజం, స్టైల్ అదుర్స్ అంటూ చాలా మంది ఆయనకు అభిమానులైపోయారు.

    తాజాగా 'బాషా' చిత్రం ఈ సమ్మర్లో మరోసారి రీరిలీజ్ కాబోతోంది. వీడియో, ఆడియో పరంగా మరిన్ని మెరుగులు దిద్ది ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. తెలుగు, హిందీలో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు. ఈచిత్రం కోసం రజనీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

    ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వంలో 'కొచ్చాడయాన్' చిత్రంలో నటిస్తున్నాడు. ఓ దుష్టశక్తి బారి నుంచి ప్రపంచాన్ని రక్షించే పోరాట యోధుడిగా రజనీకాంత్ ఈ చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో ఆయన 30 ఏళ్ల యువకుడిగా కనిపిస్తాడు. ఆయన తక్కువ వయసు వాడిలా కనిపించడం కోసం అధునాతన టెక్నాలజీని వాడుతున్నారట.

    ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్‌ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్‌ మీనన్‌ కెమెరా వర్క్ అందించనున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని, అందుకే 'ఖడ్గ రుద్ర' పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

    English summary
    Rajinikanth's ‘Baashha’ is being released again and the film is being digitally enhanced to improve video and audio quality. The movie has a cult following across South India and Rajini’s mannerisms and stylish dialogues are popular to this day. Sources say that the digitally enhanced film will be released in Telugu and Hindi as well.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X