కోలుకున్న రజనీకాంత్, సెప్టెంబర్ రాణా చిత్రం షూటింగ్
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. రజనీకాంత్ సింగపూర్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ కాబోతున్నారు. ఆయన పూర్తిగా కోలుకున్నారని చెబుతున్నారు. రజనీకాంత్ రాణా చిత్ర దర్శకుడు కెఎస్ రవికుమార్‌కు ఫోన్ చేసి తాను పూర్తిగా కోలుకున్నానని, నాలుగు రోజుల్లో ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ చేస్తారని చెప్పారని సమాచారం. రాణా చిత్ర నిర్మాణం గురించి కూడా ఆయన వాకబు చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ పూర్తిగా కోలుకున్న తర్వాతనే షూటింగ్ ప్రారంభిస్తామని రవికుమార్ చెప్పారని తెలుస్తోంది.
త్వరలోనే రజనీకాంత్ తిరిగి వస్తారని, సెప్టెంబర్‌లో రాణా సినిమా షూటింగ్ జరుగుతుందని చెబుతున్నారు. రాణా రజనీకాంత్ డ్రీమ్ ప్రాజెక్టు. అందువల్ల ఆ సినిమాను వదులుకోవడానికి ఆయన సిద్ధంగా లేరని అంటున్నారు. రాణా షూటింగ్ ప్రారంభం రోజే ఏప్రిల్ 29వ తేదీన రజనీకాంత్ అస్వస్థతకు గురయ్యారు. ఆ తర్వాత చెన్నైలోని ఆస్పత్రిలో మే 13వ తేదీన చేరారు. అనంతరం సింగపూర్ వెళ్లి అక్కడి ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆయన అభిమానులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తూనే ఉన్నారు.


Click it and Unblock the Notifications











