మరోసారి తాత అయిన రజీనీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి తాత అయ్యారు. ఆయన కూతురు ఐశ్వర్య నిన్న(సోమవారం) ఉదయం 6:21 ని:లకు ఒక మగబిడ్ద జన్మించింది. చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జన్మించిన ఆ శిశువు బరువు మూడు కిలోలు ఉన్నాడని తల్లి ఐశ్వర్య, బిడ్డ ఇద్దరూ క్షేమమేనని సమాచారం. ఇక ధనుష్, ఐశ్వర్య దంపతులకు ఇప్పటికే మూడు సంవత్సరాల యాత్ర అనే అబ్బాయి ఉన్నాడు. ఈ శుభవార్త వినగానే రజినీ పరుగున ఆసుపత్రికి వెళ్ళి అక్కడి డాక్టర్లకి కృతజ్ఞతలు తెలియచేసారు. అంతే కాదు తన రెండవ మనవడు జన్మించిన ఆనందంలో అక్కడి లిప్ట్ బోయ్ కి 500 రూ టిప్ ఇచ్చి మరీ ఆశ్చర్యపరిచారు. ఈ విషయాలని ధనుష్ ట్విట్టర్ లో ట్వీట్ చేసారు. ప్రస్తుతం రజనీకాంత్..శంకర్ దర్శకత్వంలో రోబో చిత్రాన్ని ఫినిష్ చేసారు.
ధనుష్ రజనీకాంత్ రోబో ఐశ్వర్య ట్విట్టర్ లిప్ట్ బోయ్ ఐశ్వర్య రాయ్ శంకర్ rajinikanth shankar robo dhanush aishwarya


Click it and Unblock the Notifications