12.12.12: రజనీకాంత్ స్పెషల్ ఏంటి?
ఆలిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితం అంటే ఎవరికి ఆసక్తి ఉండదు. అందుకేనేమో..ఆయన జీవిత చరిత్రను ప్రముఖ సంస్ధ పెంగ్విన్ బుక్స్ ఇండియా వారు అందించాలనుకుంటున్నారు. వారు ఈ విషయమై ప్రకటన చేస్తూ...దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ జీవితంపై రూపోందుతున్న పుస్తకం 12.12.12 తేదిన మార్కెట్‌లోకి రానుందని పెంగ్విన్ బుక్స్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది. మొట్టమొదటి సారిగా రజనీ జీవిత చరిత్రను విమర్శకుడు, నిర్మాత నామన్ రామచంద్రన్ రాస్తున్నాట్టు పెంగ్విన్ వెల్లడించింది. రజనీకాంత్ 62వ జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రత్యేక దినమైన డిశంబర్ 12 తేది, 2012 రజనీకాంత్ జీవిత చరిత్రను విడుదల చేస్తున్నట్టు పెంగ్విన్ తెలిపింది. ఈ పుస్తకంలో రజనీ గురించి బయటకు తెలియని చిత్రాలు పొందుపరుస్తున్నామని పెంగ్విన్ పేర్కొంది.
ఇక ఇప్పటికే రజనీడైలాగులతో రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా ఓ పుస్తకాన్ని అభిమానులు విడుదల చేసారు. ఆ పుస్తకం పేరు 'రజనీ పంచ్‌తంత్ర'. ఈ పుస్తకం విడుదలైన వెంటనే రజనీ అభిమానుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. ఆ పుస్తకంలో 'సింహం సింగిల్‌గా వస్తుంది...', 'అతిగా ఆశపడే మగాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడ్డట్టు చరిత్రలోనే లేదు' లాంటి పంచ్ డైలాగులు ఉన్నాయి. అయితే పుస్తకం తమిళంలో ఉంటుంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ 'కొచ్చాడయాన్'అనే ఓ త్రీడీ చిత్రం చేస్తున్నారు.తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో చేస్తున్న ఈ చిత్రం పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందించనున్నారు. ఫెర్ఫార్మెన్స్ క్యాప్చరింగ్ పరిజ్ఞానంతో ఈ సినిమాను త్రీడీలో చిత్రిస్తారు. 2012 ఆగస్టులో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమాని 'అవతార్', 'ద అడ్వెంచర్ ఆఫ్ టిన్‌టిన్' తరహాలో తీర్చిదిద్దేందుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక 'రాణా'సినిమా రజనీకాంత్ చేయాలని ఆయన అనుకున్నా హెల్త్ సమస్యలతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది.


Click it and Unblock the Notifications











