కొత్త డైరక్టర్ ని రజనీకాంత్ మెచ్చుకున్నారు
చెన్నై : రజనీకాంత్ మెచ్చుకునే విషయాన్ని తన సినిమా ప్రమోషన్ కి వాడుతున్నాడు దర్శకుడు అడ్లీ . ఆయన డైరక్ట్ చేసిన తాజా చిత్రం 'రాజారాణి' చిత్ర యూనిట్ ఆనందసాగరంలో మునిగి తేలుతోందని చెప్తున్నాడు.
దర్శకుడు అడ్లీ మాట్లాడుతూ.. ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ నాతో ముచ్చటించారు. చిత్రాన్ని చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారని కితాబిచ్చారు. సినిమా విజయవంతమవ్వాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారని ఆనందం వ్యక్తం చేశాడు. విడుదలకు ముందే రజనీకాంత్ అభినందనలు చెప్పటం ఆనందంగా ఉందని యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది. భారీ విజయం సాధిస్తుందనే భరోసా కలిగిందన్నారు.
ఆర్య- నయనతార కలయికలో వస్తున్న తాజాచిత్రం 'రాజారాణి'. వారిద్దరూ నటించిన 'బాస్ ఎన్గిర భాస్కరన్' విజయవంతం కావటంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. చిత్ర ప్రచారాలు కూడా సంచలనంగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా నయనతార, ఆర్యల వివాహం జరిగినట్లు ఇటీవల ఓ పెళ్లిపత్రిక సినీవర్గాల్లో కలకలం సృష్టించింది. ఆ పెళ్లిపత్రిక కేవలం సినిమాకు సంబంధించిందేనని చల్లగా వివరించాడు దర్శకుడు.


Click it and Unblock the Notifications












