Raninikanth కంటతడి పెట్టిన రజనీకాంత్.. తీవ్ర విమర్శలపై ఐశ్వర్య భావోద్వేగం!

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలాం చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 9వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సినిమా ప్రమోషనల్‌ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఆడియో లాంచ్ వేడుకు చెన్నైలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజనీ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన తండ్రిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించడంపై భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే..

నేను సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ వస్తున్నాను. కానీ నా తండ్రికి సంబంధించి కొన్ని ఆరోపణలు, విమర్శలను నా టీమ్ నా దృష్టికి తీసుకొచ్చింది. వాటిని చూసిన తర్వాత నాకు చాలా కోపం వచ్చింది అని ఐశ్వర్య అన్నారు.

Rajinikanth Broke Down amid Aishwarya Rajinikanth speech at Lal Salaam Audio Release Event In Chennai

మేము మనుషులమే. కానీ నా తండ్రి సంఘ్ పరివార్‌కు చెందిన వ్యక్తి అని విమర్శిస్తున్నారు. అయితే మా నాన్న ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన వారు కాదు. అలా మా నాన్న పొలిటికల్ పార్టీకి సపోర్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితి మాకు ఉండదు. ఆయనకు ఎంతో గౌరవం దక్కేది అని ఆమె స్పష్టం చేశారు.

నా మా నాన్న సంఘ్ పరివార్‌కు చెందిన వాడైతే ఆయన లాల్ సలామ్ లాంటి సినిమాను చేయరు అని ఐశ్వర్య రజనీకాంత్ చెప్పగానే రజనీ వెంటనే కన్నీటి పర్యంత అయ్యారు. ఈ సినిమాకు సెట్స్ మీదకు తీసుకెళ్లడానికి చాలా సవాళ్లు ఎదురయ్యారు. కొందరు నిర్మాతలు ఫండింగ్ చేయడానికి వెనుకాడారు అని ఐశ్వర్య చెప్పారు.

లాల్ సలామ్ సినిమాకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. అలాంటి అవరోధాలను ఎదురించి ఈ సినిమాను నిర్మించాం. ఓ దశలో మా నాన్న వల్ల సమస్యలు ఎదురవుతున్నాయని భావించి.. నేను ఆయనను నటింప చేయకూడదని అనుకొన్నాను అని ఐశ్వర్య రజనీకాంత్ చెప్పారు.

Rajinikanth Broke Down amid Aishwarya Rajinikanth speech at Lal Salaam Audio Release Event In Chennai
ముంబై బ్యాక్ డ్రాప్‌గా రూపొందిన లాల్ సలామ్ చిత్రంలో మోయిదీన్ భాయ్‌గా నటించారు. అయితే ఈ కథ చెప్పినప్పుడు, స్క్రిప్టు ఇచ్చినప్పుడు ఆ పాత్రలో నటించడానికి ఆసక్తి చూపారు. అయితే మా నాన్న లెగసీకి ఈ పాత్ర ఏదైనా హానీ చేస్తుందా అనే భయం నాలో కలిగింది. దాంతో వద్దని చెప్పాలని అనుకొన్నాను అని ఐశ్వర్య అన్నారు. ఐశ్వర్య ప్రసంగం సమయంలో రజనీకాంత్, ఆయన అభిమానుల తీవ్రమైన భావోద్వేగానికి లోనయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X