రజనీకాంత్ కుటుంబంలో విషాదం

By Bojja Kumar

సూపర్ స్టార్ రజినీకాంత్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. రజనీ సోదరుడు సత్యనారాయణరావు గైక్వాడ్ సతీమణి కళావతి (72) కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆమె బెంగుళూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మరణించారు.

ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న రజనీకాంత్... వదిన మరణవార్త విన్న వెంటనే బెంగుళూరు వెళ్లారు. సోమవారం సాయంత్రం కళావతి అంత్యక్రియలు ముగిసాయి. రజనీ కుటుంబం అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది.

Rajinikanth brothers wife passed away

రజనీకాంత్ ఇంత పెద్ద స్టార్ అయినా... ఆయన నుండి సోదరుడు సత్యనారాయణ ఎలాంటి సహాయం ఆశించలేదట. మా వదిన తరచూ చెన్నైలోని మా ఇంటికి వస్తుండేదని గతంలో ఒకసారి రజనీకాంత్ గుర్తు చేసుకున్నారు.

కాగా... బెంగుళూరులో కళావతి అంత్యక్రియల అనంతరం కార్యక్రమాలు ముగిసిన అనంతరం చిత్ర యూనిట్‌తో కలిసి లడఖ్‌లో జరిగే షెడ్యూల్‌లో రజనీకాంత్ జాయిన్ అవుతారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X