రజనీకాంత్ పెద్ద మనసు... రూ. 1 కోటితో నిర్మాత కోసం ఇల్లు!
తమిళనాడుకు చెందిన ప్రముఖ నిర్మాత, రచయిత కలైగ్నానం సినిమా రంగానికి చేసిన సేవలను అభినందిస్తూ ఇటీవల సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆగస్టు 14న జరిగిన ఈ కార్యక్రమంలో తమిళ సినీ ప్రముఖులు రజనీకాంత్, దర్శకుడు భారతీరాజా, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నటుడు శివకుమార్ మాట్లాడుతూ, నిర్మాత కలైగ్నానం ఇంకా అద్దె ఇంట్లోనే ఉన్నారని, ఆయన సొంత ఇల్లు కొనుక్కోవడానికి సహాయం అందించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.
ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ మాట్లాడుతూ... కలైగ్నానం కోసం తాను కొత్త ఇల్లు కొనబోతున్నట్లు ప్రకటించారు. నేను తమిళనాడు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వను. త్వరలో కలైగ్నానం కోసం ఒక ఇల్లు ఉంటుంది. 10 రోజుల్లో డబ్బు ఇస్తాను" అని వ్యాఖ్యానించారు.

కలైగ్నానం నిర్మించిన బైరవి (1978) చిత్రంలో రజనీకాంత్ నటించారు. సోలో హీరోగా ఇది ఆయనకు మొదటి చిత్రం. బైరవి తనకు ఎప్పుడూ ప్రత్యేకమైన సినిమా అంటూ రజనీకాంత్ అనేక సందర్భాల్లో వెల్లడించారు.
ఈ నిర్మాత కోసం రజనీకాంత్ రూ. 1 కోటి ఖర్చుతో ఇల్లు కొన్నారంటూ తాజాగా తమిళ మీడియాలో వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. సదరు ప్రాపర్టీని భారతీరాజా చూసి ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ సమాచారం ఏమీలేదు. భారతీరాజా ఇంకా ఇంటిని వెతికే పనిలో ఉన్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం ఆయన 'దర్బార్' మూవీ షూటింగులో బిజీగా ఉన్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2020 సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార హీరోయిన్, యోగి బాబు ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











