మరోసారి హైదరాబాద్‌కు రజినీకాంత్: ఆ హోటల్‌లోనే బస.. పూర్తి చేశాకే వెళ్తాడట
దాదాపు నలభై ఏళ్లుగా తమిళ సినీ ఇండస్ట్రీలోనే కాక దేశ వ్యాప్తంగా తన హవాను చూపిస్తున్నారు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏజ్ బార్ అవుతున్నా ఏమాత్రం వెనకడుగు వేయకుండా వరుసగా సినిమాలు చేస్తున్నారాయన. ఈ క్రమంలోనే ప్రస్తుతం మాస్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తోన్న 'అన్నత్తే'లో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం అయింది. మధ్యలో కరోనా వల్ల లాక్‌డౌన్ రావడం.. ఆ తర్వాత రజినీకాంత్‌కు సర్జరీ జరగడం.. అనంతరం ఆయన అనారోగ్యానికి గువడం వంటి కారణాల వల్ల చిత్రీకరణ చాలా ఆలస్యం అయింది.
ఇలాంటి పరిస్థితుల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ గురువారం హైదరాబాద్‌లో అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల్లో ప్రారంభం కాబోతున్న 'అన్నత్తే' షూటింగ్ కోసమే ఆయన నగరానికి వచ్చినట్లు సమాచారం. చెన్నైలో ఈరోజు ఉదయం ప్రత్యేక విమానంలో బయలు దేరిన ఆయన బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి ఓ ప్రముఖ హోటల్‌కు వెళ్లారు. ఇక, రామోజీ ఫిల్మ్ సిటీలో సాగే షెడ్యూల్‌లో ఆయన పాల్గొనబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. దాదాపు ఈ షూటింగ్ 20 రోజులకు పైగానే సాగనుందని అంటున్నారు.

గతంలోనూ 'అన్నత్తే' షూటింగ్ కోసం రజనీకాంత్ హైదరాబాద్‌కు రాగా.. ఆయన అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఈ షెడ్యూల్ క్యాన్సిల్ అయింది. ఇక, లాంగ్ గ్యాప్ తర్వాత మరోసారి నగరానికి చేరుకున్న ఆయన.. ఈ సారి సినిమాను పూర్తి చేసిన తర్వాతనే చెన్నై వెళ్లనున్నారని తెలుస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











