గెస్ట్ రోల్ కి రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్

By Srikanya

అనారోగ్యం నుంచి కోలుకున్న రజనీకాంత్ మళ్ళీ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. అక్టోబర్ 4 న రామోజి ఫిల్మ్ సిటీలో జరిగే షూటింగ్ లో ఆయన పాల్గొనబోతున్నట్లు సమాచారం.ఆ చిత్రం షారూఖ్ ఖాన్ భారీ చిత్రం రా వన్. ఆ చిత్రంలో రజనీకాంత్ గెస్ట్ గా కనిపిస్తారు. రోబోలాగ ఆయన కనిపించి షారూఖ్ ని,కరీనాని విలన్స్ బారీ నుంచి రక్షిస్తారని తెలుస్తోంది. తెలుగు,తమిళంలోకూడా ఈ చిత్రాన్ని షారూఖ్ రిలిజ్ చేయాలని బావించటంతో రజనీ గెస్ట్ రోల్ మార్కెటింగ్ కి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. ఇక రజనీ కూడా పూర్తిగా గ్యాప్ లేకుండా ఈ చిత్రంలో నటించటం బెస్ట్ అని భావించే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సైన్‌ ఫిక్షన్‌ సూపర్‌ హీరో ఇతివృత్తం ప్రధానాంశంగా షారూఖ్‌ ఖాన్‌, కరీనా కపూర్‌, అర్జున్‌ రామ్‌పాల్‌ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న 'రా.వన్‌' చిత్రానికి అనుభవ్‌ సిన్హా దర్శకుడు. అలాగే 'రా.వన్‌' చిత్రాన్ని స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఇండియాలోనే నిర్మించినట్టు షారూఖ్‌ చెప్పాడు. ''సినిమాలో మీరు చూసేందంతా కూడా ఇక్కడ నిర్మించిందే... అందుకు మేమెంతో గర్విస్తున్నాం. మా టీమ్‌ గొప్పగా పనిచేసింది. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒకడుగు ముందుకు తీసుకువెళ్లాం'' అని ఆయన వివరించారు. దక్షిణాది ప్రేక్షకుల కోసం అన్నట్టుగా 'రా.వన్‌' చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో అనువదిస్తున్నారు.

''తెలుగు, తమిళ భాషల్లో చిత్రం అనువాద కార్యక్రమాలు ఏక కాలంలో జరుగుతున్నాయి. అంతేకాక జర్మనీ, తదితర భాషల్లో కూడా అనువదించే ఆలోచనలో ఉన్నాం'' అని షారూఖ్‌ వెల్లడించాడు.ఇక షారూఖ్ ... తనకు పిల్లల కోసం ఎప్పుటినుంచో ఓ చిత్రం చేయాలని కోరిక ఉందని, అందులో భాగమే ఈ చిత్రం రూపకల్పన అన్నారు.నేను నిజాయితీగా చెప్తున్నాను..ఎక్స్ మెన్ సిరీస్ నుంచే ప్రేరణ పొందాను అన్నారు.ఇక తాను డైరక్ట్ గా హాలీవుడ్ చిత్రం చేస్తానని అయితే ఆ చిత్రం తన కెరీర్ అతి గొప్ప చిత్రం కావాలని,అందరూ గుర్తు పెట్టుకునేలా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు.షూటింగ్ అనంతరం కూడా చిత్రాన్ని త్రీడి టెక్నాలజీలోకి మార్చడానికి చర్యలు చేపట్టామన్నారు. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంగా రూపొందిన ఈ చిత్రానికి అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. కరీనాకపూర్ అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రల్ని పోషించారు. రా.వన్ అంటే రాండమ్ యాక్సెస్ వెర్షన్ అని అర్ధమని షారుఖ్ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X