రజనీ చంద్రముఖి టీం మళ్లీ వస్తోంది

By Bojja Kumar

రజనీకాంత్, పి.వాసు కాంబినేషన్లో ఆ మధ్య వచ్చిన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ కాంబినేషన్ మరోసారి రిపీటీ కాబోతోంది. ఈ కాంబినేషన్ మళ్లీ వస్తుండటంతో మరో చంద్రముఖి లాంటి బ్లాక్ బస్టర్ ఖాయం అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

తాజాగా చెన్నయ్ సినీ వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం పి.వాసు ఇటీవల రజనీకి ఓ కథ చెప్పాడని, ఇందుకు రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. చంద్రముఖ చిత్రాన్ని తెరకెక్కించిన శివాజీ ప్రొడక్షన్స్ వారే ఈ చిత్రాన్ని తెరకెక్కించడానికి ముందుకు రావడం గమనార్హం.

ప్రస్తుతం రజనీకాంత్ తన కూతురు సౌందర్య దర్శకత్వం వహిస్తున్న కొచ్చాదయన్ చిత్ర షూటింగులో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే పి.వాసు ప్రాజెక్టులో నటించే అవకాశం ఉంది. ఇప్పటికే స్క్రిప్టు వర్కు పూర్తి చేసిన పి.వాసు స్పైసీ, ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించే యోచనలో ఉన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X