రజనీకాంత్ ఎంట్రీ...పోలీసులు లాఠీ చార్జీ
నెల రోజుల పాటు సింగపూర్ లో చికిత్స పొంది, పూర్తిగా కోలుకున్న రజనీకాంత్ భారతదేశానికి తిరిగి వచ్చారు. రాత్రి పొద్దుపోయాక చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు ఆయన అభిమానులు ఎక్కడెక్కడివారు చెన్నై చేరుకుని ఘన స్వాగతం చెప్పారు. రజనీకాంత్ అభిమానులు దారిపోడవునా, పెద్ద, పెద్ద బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే విమానం దిగి వచ్చిన రజనీకాంత్ ను జనం ఎగబడడంతో తొక్కిసలాట జరగ్గా, పోలీసులు వారిని అదుపు చేయడానికి లాఠీ చార్జీ చేయవలసి వచ్చింది.
ఇక రజనీతో పాటు ఆయన భార్య లత,కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలుకూడా విమానంలో వచ్చారు. తాను ఇంత త్వరితగతిన కోటుకోవడానికి కారణం అభిమానులు చేసిన పూజలు, ప్రార్ధనలేనని రజనీకాంత్ ఒక ప్రకటనతో కృతజ్ఞతలు తెలియచేశారు. సింగపూర్ లో ఉండగానే రజనీకాంత్ రాణా సినీ దర్శకుడు రవికుమార్ తో కధ కు సంబంధించి చర్చలు జరిపారని, వచ్చే వారం నుంచి యధావిధిగా రజనీకాంత్ షూటింగ్ లో పాల్గొంటారని కుటుంబవర్గాలు చెప్పాయి.


Click it and Unblock the Notifications











