కూల్‌గా కూర్చొని మాట్లాడుతున్న సూపర్ స్టార్, డైరెక్టర్.. లైఫ్‌లో ది బెస్ట్ అదే..
సూపర్ స్టార్ రజినీ కాంత్.. వెండితెరపై హల్‌చల్ చేసేందుకు వచ్చేస్తున్నాడు. మరోసారి పోలీస్ లాఠీ పవర్ చూపించేందుకు ముంబై గ్యాంగ్ స్టర్‌లను మట్టుబెట్టేందుకు సిద్దమవుతున్నాడు. విలక్షణ దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్‌తో దర్బార్ అంటూ తలైవా రెడీ అయ్యాడు. శరవేగంగా షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్ర యూనిట్ డబ్బింగ్ పనులను కూడా మొదలెట్టేసింది.

ప్రత్యేక పాత్రల్లో నయన్, నివేదా..
ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయన్ తార, నివేదా థామస్ ప్రత్యేక పాత్రలను పోషిస్తున్నారు. రజినీ కూతురుగా నివేదా నటిస్తుండగా.. ఆ మధ్య చేసిన ట్వీట్ తెగ వైరల్ అయింది. ఈ ప్రపంచం తెలుసుకోవాల్సిన ఓ వ్యక్తి ఉన్నాడు అదే మా నాన్న అంటూ రజినీ క్యారెక్టర్ గురించి వివరించింది. ఈ చిత్రంలో రజినీ పాత్రను పవర్ ఫుల్‌గా తీర్చిదిద్దాడని తెలుస్తోంది.

డబ్బింగ్‌లో రెచ్చిపోయిన రజినీ..
షూటింగ్ పూర్తైన ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలెట్టేశారు. ఈ క్రమంలో రజినీ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా ప్రారంభించాడు. డబ్బింగ్ థియేటర్‌లో తలైవా వీరావేశంతో డైలాగ్ చెబుతూ ఉన్న పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది యూనిట్. ఆ పోస్టర్ ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలిసిందే.
డబ్బింగ్ పూర్తి..
ఆదిత్య అరుణాచలం అనే పోలీసాఫీసర్ పాత్రను పోషిస్తున్న రజినీకి.. ఏదో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. రజినీ తన పాత్రకు చెప్పిన డబ్బింగ్‌ను చూసి ఏఆర్ మురుగదాస్ ఆశ్చర్యపోయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు సోషల్ మీడియాలో రజినీపై చేసిన కామెంట్ వైరల్ అవుతోంది.
Recommended Video

నా లైఫ్‌లో ఇదే బెస్ట్..
రజనీ స్టైల్ మ్యానరిజం, డబ్బింగ్ చెప్పిన తీరుకు మురుగదాస్ మంత్రముగ్దుడైనట్టు కనిపిస్తోంది. డబ్బింగ్ పూర్తి చేసిన రజినీని ఉద్దేశించి.. నా లైఫ్‌లో ఇదే బెస్ట్ డబ్బింగ్స్‌లో ఇదొక్కటి.. తలైవార్ దర్బార్ డబ్బింగ్ పూర్తి అయిందంటూ ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా వారిద్దరు కలిసి కూల్‌గా ముచ్చట్లు పెడుతున్న ఫోటోను షేర్ చేశారు. దర్బార్.. సంక్రాంతి బరిలోకి దిగి మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయనుంది.


Click it and Unblock the Notifications











