అన్ని చోట్లా దర్బార్ హవా.. టాప్‌లో ట్రెండింగ్
సూపర్ స్టార్ రజినీ కాంత్.. ప్రస్తుతం ఆదిత్యా అరుణాచలంగా రాబోతోన్నాడు. ముంబై గ్యాంగ్ స్టర్‌లను ఏరిపారేయడానికి వస్తోన్న ఈ పోలీసాఫర్.. బ్యాడ్ కాప్ అంటూ చెప్పుకుంటున్నాడు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ ట్రైలర్‌ను నిన్ననే విడుదల చేశారు. ఇక రజినీ స్పీడు, స్టైల్ చూస్తుంటే ఒకప్పటి తలైవా గుర్తొస్తున్నాడని కామెంట్లు వినిపిస్తున్నాయి.
వరుస ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న రజినీ వెంటవెంటనే సినిమాలు చేసేస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. రోజురోజుకు ఫుల్ జోష్, స్పీడ్ కనిపిస్తుండగా.. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌లోనూ కొత్తదనం కనిపిస్తూ ఉంది. ఏఆర్ మురుగదాస్-రజినీ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ ట్రైలర్ విడుదలైన అన్ని భాషల్లో దూసుకుపోతోంది.

తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ జెట్ స్పీడ్ వేగంలో వ్యూస్‌ను సంపాదించుకుంటోంది. తమిళంలో ఇప్పటికే 7.3మిలియన్లు క్రాస్ చేయగా, హిందీలో 11మిలియన్ల వ్యూస్, తెలుగులో 2.3 మిలియన్ల వ్యూస్‌తో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇక ట్రైలరే ఈ రేంజ్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తే సంక్రాంతికి బాక్సాఫీస్ షేక్ కావడం ఖాయమని ట్రేడ్ పండితులు విశ్లేషిస్తున్నారు. నయనతార, నివేదా థామస్ నటిస్తోన్న ఈ మూవీకి అనిరుధ్ సంగీతాన్ని సమకూర్చాడు.


Click it and Unblock the Notifications











