ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో భారీ చోరీ.. 18 ఏళ్లుగా అదే పని.. ఆ డబ్బుతో ఏకంగా ఇల్లు కట్టిన దొంగలు

సూపర్ స్టార్ రజనీ కాంత్ ను ఆయన అభిమానులు ముద్దుగా తలైవా అని పిలుచుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న అతి కొద్దిమంది సౌత్ హీరోలలో రజనీ కాంత్ ముందు వరుసలో ఉంటారు. ఇక ఆయన కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ కూడా సినీ రంగంలో రాణిస్తున్న విషయం తెలిసిందే.

పేరుకు రజనీకాంత్ కూతురిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె తనదైన టాలెంట్ తో దూసుకుపోతోంది. అయితే ఇటీవల ఆమె ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. చోరీ జరగడమే కాకుండా ఆమె ఇంటి నుంచి దొంగలించిన డబ్బుతో దొంగలు ఏకంగా ఇల్లు కట్టడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏమైందనే వివరాల్లోకి వెళితే..

మరో సినిమాకు దర్శకత్వం..

మరో సినిమాకు దర్శకత్వం..

ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న విషయం తెలిసిందే. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, శ్రుతిహాసన్ హీరో హీరోయిన్లుగా నటించిన త్రీ సినిమాకు ఆమె డైరెక్షన్ చేశారు. ఈ సినిమా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు ఆమె మరో సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఇందులో నటిస్తున్నారు.

రాజకీయ నేపథ్యంతో..

రాజకీయ నేపథ్యంతో..

ఐశ్వర్య రజనీకాంత్ తాజాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా లాల్ సలామ్. ఈ మూవీలో విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ హీరోలుగా నటిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుభాస్కరన్ సమర్పణలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడం విశేషం.

ఇదివరకు టైటిల్ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా క్రికెట్ తోపాటు రాజకీయ నేపథ్యంలో ఉండనుందని సమాచారం. రజనీ కాంత్ ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ సినిమా మార్చి 8న సెట్స్ పైకి వచ్చింది. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

 అనుమానితుల వివరాలు..

అనుమానితుల వివరాలు..

ఇదిలా ఉంటే ఇటీవల ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో పెద్ద చోరీ జరిగింది. దీంతో ఆమె ఫిబ్రవరి నెలలో పోలీసులను ఆశ్రయించారు. చెన్నైలోని తన ఇంట్లో దాచిన సుమారు 60 సవర్ల బంగారం, వజ్రాల నగలు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఐశ్వర్య.

దీంతో ఆభరణాల విలువ, అనుమానితుల వివరాలు చెప్పాల్సిందిగా పోలీసులు కోరారు. తన డైమండ్ సెట్ లు, టెంపులు జ్యూవెలరీ, నవరత్నాల సెట్లు, పాత బంగారం, గాజులు తదితర ఆభరణాల వివరాలు ఇచ్చారు ఐశ్వర్య.

ఇంట్లో లేనప్పుడు..

ఇంట్లో లేనప్పుడు..

ఈ ఆభరణాలన్నింటిని తన ఇంటి లాకర్ లోనే పెట్టానని, చివరిసారిగా వాటిని 2019లో చూసినట్లు, తన సోదరి సౌందర్య పెళ్లి తర్వాత తిరిగి వాటిని ఆ లాకర్ లోనే పెట్టేసినట్లుగా ఐశ్వర్య రజనీకాంత్ వెల్లడించారు. అప్పటి నుంచి ఆ నగలు వేసుకోలేదని ఆమె తెలిపారు. తన ఇంట్లో పనిచేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకటేషన్ లపై అనుమానం ఉన్నట్లుగా ఐశ్వర్య చెప్పారు. తాను ఇంట్లో లేనప్పుడు వారు మాత్రమే తన ఇంటికి వచ్చేవారని, తాళాలు ఎక్కడ పెడతానో వారికి తెలుసుని ఆమె పేర్కొంది.

 18 ఏళ్లుగా పనిచేస్తూ..

18 ఏళ్లుగా పనిచేస్తూ..

ఐశ్వర్య చెప్పిన వివరాలతో పోలీసులు సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. దీంతో కీలక విషయాలు వెలుగుచూశాయి. మండావలీ ప్రాంతానికి చెందిన ఈశ్వరి (46) అనే మహిళ ఐశ్వర్య ఇంట్లో సుమారు 18 ఏళ్లుగా పనిచేస్తోందని, తిరువెరకుడుకు చెందిన కె. వెంకటేశన్ అనే డ్రైవర్ తో గత కొన్నాళ్లుగా ఆ ఇంట్లోని వస్తువులు, నగలు చోరీ చేసిందని పోలీసులు వెల్లడించారు. అన్నీ ఒకేసారి చేస్తే అనుమానం కలుగుతుందని అప్పుడప్పుడు దొంగలించేవారని అన్నారు.

 నగదుగా మార్చేసి..

నగదుగా మార్చేసి..

అలా దొంగలించిన ఆభరణాలతో ఈశ్వరి చెన్నైలో ఒక ఇల్లు కూడా కట్టుకుందని పోలీసులు తెలిపారు. అలాగే కొన్ని విలువైన వస్తువులను సైతం కొనుగోలు చేసిందన్నారు. అయితే ఐశ్వర్య ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం కంటే ఎక్కువ విలువైన ఆభరణాలు వారు చోరీ చేసినట్లు విచారణలో తేలింది. ఐశ్వర్య ఇంటి నుంచి సుమారు 100 సవర్ల బంగారం, 30 గ్రాముల డైమండ్ నగలు, 4 కిలోల వెండి సామాన్లు, కొన్ని విలువైన డాక్యుమెంట్లు దొంగలించారు. ఇప్పటికే వాటిని నగదుగా మార్చినట్లు విచారణలో తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X