రజనీకాంత్‌తో సాంగేసుకోనున్న దీపికా పడుకొనే
సూపర్ స్టార్ రజనీకాంత్, బాలీవుడ్ సెక్సీ గర్ల్ దీపిక పడుకొనె త్వరలో డ్యూయెట్ సాంగ్ వేసుకోనున్నారు. ఈ ఇద్దరు జంటగా నటిస్తున్న 'రాణా" సినిమాకు సంబంధించి మూడు పాటలను మ్యూజిక్ డైరెక్టర్ ఎఆర్ రెహ్మాన్ ఇటీవల పూర్తి చేశాడు. రెహ్మాన్ అందించిన స్వరాలు చాలా బాగున్నాయని, సెప్టెంబర్ రాణా సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభిస్తామని చిత్ర దర్శకుడు కె.ఎస్ రవి కుమార్ తెలిపారు. తొలుత పాటలను చిత్రీకరించిన తర్వాత డబ్బింగ్ పార్ట్ పూర్తి చేస్తామని ఆయన వెల్లడించారు.
రజనీకి సరిపోయే విధంగా తన బాడీని బ్లెండ్ చేసుకోవడానికి దీపిక ట్రయ్ చేస్తోంది. తొలిసారిగా ఓ సీనియర్ స్టార్ సరసన నటిస్తున్న నేపథ్యంలో.... ఎలాంటి తేడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటోందట.


Click it and Unblock the Notifications











