రజనీతో కలిసి దీపికా జపాన్ టూర్
చెన్నయ్ : సూపర్ స్టార్ రజనీ కాంత్ కు ఇండియాతో పాటు ఇతర దేశాల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ముఖ్యంగా జపాన్ లో రజనీ సినిమాలకు మహాక్రేజ్. ఈ నేపథ్యంలో తన తాజా సినిమా 'కొచ్చాడయాన్' చిత్రాన్ని జపాన్ లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
సినిమా ప్రమోషన్లో భాగంగా రజనీకాంత్, ఈ చిత్ర హీరోయిన్ దీపిక పడుకొనె జపాన్ టూర్ కు సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం రజనీకాంత్ పుట్టిన రోజును పురస్కరించుకుని 12.12.12న విడుదలవుతోంది. అదే విధంగా 'కొచ్చాడయాన్' చిత్ర ప్రీమియర్ షో ప్రపంచంలోని ముఖ్యపట్టాలన్నింటిలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సునామీ తర్వాత రజనీ జపాన్ లో పర్యటిద్దామని అనుకున్నారు కానీ కొన్ని కారణాల వల్ల ఆయన వెళ్ల లేక పోయారు.
ఈ చిత్రంలో రజనీకాంత్..రణధీరన్ అనే రాజు పాత్రలో కనిపించనున్నారు. పల్లవుల కాలంలో చోటు చేసుకొన్న కొన్ని సంఘటనల ఆధారంగా అల్లుకొన్న కథ. ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు రాజీవ్ మీనన్ కెమెరా వర్క్ అందిస్తున్నారు. ఈచిత్రంలో రజనీకాంత్ లాంగ్ హెయిర్ తో శివున్ని పోలి ఉంటాడని, కత్తులతో పోరాటం చేసే యోధుడిగా కనిపించనున్నాడని తెలుస్తోంది.
దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.
ఇదో ఫాంటసీ సినిమా. కేవలం పిల్లల్నే గాక అందర్నీ ఈ సినిమా ఆకర్షిస్తుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతోంది. ఎరోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, మీడియా వన్ గ్లోబల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సునీల్ లుల్లా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసే అవకాశాన్ని లక్ష్మీగణపతి ఫిలింస్ అధినేత బి.సుబ్రహ్మణ్యం దక్కించుకున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











