అక్టోబర్ 3న పునః ప్రారంభమవుతున్న ‘రానా’

By Sindhu

వరుస విజయాలతో దూసుకు వస్తూ 'రోబో ' చిత్రంలోని తన వైవిధ్యమైన నటనతో అశేష ప్రేక్షకాభిమానుల మదిలో మరో మెట్టు ఎక్కిన రజనీకాంత్ తదుపరి చిత్రం కోసంగా అందరూ ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలోరజనీకాంత్ కథానాయకుడుగా నటిస్తున్న 'రానా' చిత్రం ప్రారంభొత్సవాన్ని జరుపుకొంది. ఈ చిత్రం ప్రారంభోత్సవం నాడే రజనీ అనారోగ్యం పాలవ్వడం రజనీ అభిమానులను కలవరపెట్టింది.అయితే ప్రస్తుతం రజనీ సింగపూర్ లో చికిత్స చేయించుకొని పూర్తి ఆరోగ్యంగా వున్నందువల్ల కొద్దినెలల విశ్రాంతి అనంతరం తిరిగి 'రానా ' చిత్రాన్ని ప్రారంభించాలని అనుకొంటున్నారు ఈ చిత్ర నిర్మాత, దర్శకులు. ఈ నేపధ్యంలో అక్టోబర్ 3 నుండి రజనీకాంత్ హీరోగా నటించబోయే 'రానా' చిత్రం తిరిగి ప్రారంభం కానున్నదని తెలిపారు.

స్వతహాగా రజనీ నటీంచే సినిమా అంటే అందరికీ ఆసక్తిగా వుంటుంది.ఆరంభం నుండీ అంచనాలు భారీగానే వుంటాయి.అటువంటి భారీ అంచనాలతో రూపుదిద్దుకోబోయే చిత్రంగా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు.'రానా' చిత్రం కె యస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందనుంది.ఈ సందర్బంగా దర్శకుడు మాట్లాడుతూ 'రజనీ కోలుకొన్నారు. ఫుల్ జోష్ గా వున్నారు.అక్టోబర్ నుండి ఈ చిత్రం షూటింగ్ ని పునః ప్రారంభిస్తాము అని తెలిపారు. రజనీ 'రానా 'గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ దీపికా పదుకొనే, టబు, మరియు ఇలియానా ముగ్గురు కథానాయికలు నటిస్తారు.అలాగే రజనీ మూడు రకాల పాత్రల్లో ప్రేక్షకులను అలరించనున్నారు.ఈ చిత్రంలో రానా కత్తి యుద్దాలు గుర్రపు స్వారీ లూ చేయనున్నారు.ఇన్ని విశేషతలున్న'రానా' చిత్రం త్వరగా సెట్స్ పైకి ఎప్పుడెప్పుడు వెళుతుందాని ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X