ఆ స్టార్ సినిమాలో రజనీకాంత్ ఐటమ్ సాంగ్

By Srikanya

రజనీకాంత్ ఐటమ్ సాంగ్ చేయబోతున్నాడనే వార్త ఇప్పుడు బాలీవుడ్ లో దావానలంలా వ్యాపిస్తోంది. అమీర్ ఖాన్ తాజా చిత్రం తలాష్ లో రజనీ చేసే సాంగ్ హైలెట్ కాబోతోందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఈ పాటకి అక్షరాలా పదిహేను కోట్లు ఖర్చు పెట్టారని చెప్పుకుంటున్నారు. అయితే ఈ విషయమై ఇప్పటివరకూ అఫీషియల్ గా న్యూస్ రాలేదు. దాంతో ఇది గాసిపో,నిజమో తెలియని పరిస్దితి అభిమానులలో ఏర్పడింది.

ఇక రజనీకాంత్ ప్రస్తుతం ...తన కుమార్తె సౌందర్య దర్శకత్వంలో 'కోచడయాన్' అనే చిత్రం చేస్తున్నారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌కి 'విక్రమసింహా' అనే పేరును ఖరారు చేశారు. ఓ భిన్నమైన నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో ఇప్పటివరకూ కనిపించని ఓ కొత్త గెటప్‌లో రజనీ కనిపంచనున్నారు. దీపికా పదుకొనే ఇందులో హీరోయిన్ గా నటిస్తున్న విషయం విదితమే. భారతదేశంలోనే తొలిసారిగా మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కుతోన్న చిత్రం ఇదే కావడం గమనార్హం. ఏఆర్ రెహమాన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

రజనీకాంత్ చిత్రం గురించి మాట్లాడుతూ...''ఈ సినిమాకు సంబంధించి చాలా ఊహాశక్తి, మైమింగ్‌ అవసరముంటుంది. ఇది అనుకున్నంత సులభం కాదు. మోషన్‌ టెక్నాలజీతో షాట్స్‌ తీయడం ఒక సవాల్‌ ... ఇదొక టఫ్‌ జాబ్‌ అన్నారు. అలాగే ఈ చిత్రం రజనీ అభిమానులకు 'కొచడైయాన్‌' ఒక విందులాంటిదని యూనిట్‌ పేర్కొంది. ఈ సినిమాకి సంబంధించి విడుదల చేసిన ప్రమోషనల్‌ మెటీరియల్‌ అందరి మన్ననలు పొందుతోంది. ఇందులో భాగంగా రెండు నిమిషాల 12 సెకెండ్ల నిడివి గల ఒక వీడియోను కూడా ఆవిష్కరించారు. రజనీకాంత్‌, శరత్‌కుమార్‌, నాజర్‌లతో కూడిన దృశ్యాలను ఇందులో పొందుపరిచారు. చిత్రంలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌, శోభన, రుక్మిణి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అలాగే 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకొన్న దర్శకుడు కె.వి.ఆనంద్‌. ఛాయాగ్రహణం నుంచి దర్శకత్వం వైపు వచ్చారాయన. ప్రస్తుతం సూర్య కథానాయకుడిగా ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఆ తరవాత రజనీకాంత్‌ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నట్లు చెన్నై సమాచారం. ఏజీఎస్‌ అనే సంస్థ ఈ సినిమాను నిర్మిస్తుంది. ఇప్పటికే రజనీ, ఆనంద్‌ల మధ్య కథాంశంపై చర్చలు సాగాయని చెబుతున్నారు. 'కోచ్చడయాన్‌' తరవాతే ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యే అవకాశాలున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X