రిటైర్ మెంట్ గురించి రజనీకాంత్ ప్రకటన

By Srikanya

''నా టాలెంట్ ఏమైనా ఉందంటే అది తెరపై చురుకుగా కనిపించటమే ..నాలో చురుకుదనం ఉన్నంత కాలం నటిస్తునే ఉంటానని మాట ఇస్తున్నా..నేను రిటైర్ మెంట్ కాను అని'' అని తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తేల్చి చెప్పారు.ఆయన అనారోగ్యం నుంచి కోలుకున్న తర్వాత మీడియాతో మొదటి సారిగా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ''అనారోగ్యం పాలయ్యాక విశ్రాంతి తీసుకుంటూ ఇంటికే పరిమితం కావాలనుకున్నాను. కానీ నా వల్లకాలేదు'' అన్నారు. ఇక ''నేనేమీ శివాజీ గణేశన్‌ కాదు సరికదా కమల్‌ హాసన్‌ కూడా కాదు. వెరైటీ పాత్రలు చేయటం నావల్లకాదు. నేను కేవలం హీరోగానే ఉంటాను'' అని అభిమానుల కరతాళధ్వనుల మధ్య రజనీ ప్రకటించారు. సింగపూర్‌లో చికిత్స చేయించుకొని తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆయన ప్రజల ముందుకు వచ్చారు. చాలా ఆరోగ్యంగా కనిపించారు. ఆయన తాజాగా షారూఖ్ ఖాన్ చిత్రం రావన్ లో నటించారు. గెస్ట్ గా కనపడ్డ ఆయన తన అబిమానులును ఆనందపరిచారు.

రోబో తర్వాత రజనీ నటిస్తున్న సినిమా రాణా. సినిమా షూటింగు రోజే సూపర్ స్టార్ అనారోగ్యం పాలవడంతో సినిమా అర్థాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం రజినీ పూర్తిగా కోలుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్ మొదలు పెట్టాలని ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయాన్ని రజనీ చిన్న కూతురు సౌందర్య కన్ ఫర్మ్ చేశారు. సినిమాను నిలిపి వేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మ వద్దని, రాణా సినిమాలో నాన్న నటిస్తున్నారని స్పష్టం చేశారు. రాణా సినిమాకు కె.ఎస్. రవి కుమార్ దర్శకుడు. రజనీ సరసన బాలీవుడ్ భామ దీపిక పడుకొనె నటిస్తోంది. ఇది వరకు వచ్చిన రోబో సినిమా రేంజ్ లో భారీ గ్రాఫిక్స్ ఎఫెక్ట్స్ తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈరోస్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై రజనీ కూతురు సౌందర్య ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ రత్నవేలు, సంగీతం ఎ.ఆర్. రెహమాన్. తెలుగు, తమిళ, హిందీ బాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X