కండలవీరుడి డ్రీమ్స్ కి బ్రేక్ వేసిన రజనీకాంత్ ఫ్యామిలీ...!

By Sindhu

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ జీవితం ఆధారంగా బాలీవుడ్‌ లో ఓ చిత్రం రెడీ అవుతోంది. ఇందుకు సంబంధించిన కధా చర్చలు చురుగ్గా సాగుతున్నాయి. సల్మాన్‌ ఖాన్‌ బావ అతుల్‌ అగ్నిహోత్రి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటించే అవకాశాలున్నాయంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు. ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌. ఆయన తెరపై కనిస్తే చాలు అభిమానుల ఆనందానికి అవధలుండవు.

డైలాగ్‌ డైలాగ్‌ కి చప్పట్ల వర్షమే. రజనీ సినిమాల్లో ప్రదర్శించే డిఫరెంట్‌ డిఫరెంట్‌ స్టైల్స్‌కి సలాం కొట్టనివారండరంటే అతిశయోక్తేకాదు. భాషా, అరుణాచలం, శివాజీ, చంద్రముఖి, రోబో ఇలా ఒక్కో సినిమాలోనూ రజనీది ఒక్కో స్టైల్‌. ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో ఓ లెంజడరీ అయిన తలైవర్‌ జీవితం ఆధారంగా ఓ సినిమా నిర్మిచేందుకు బాలీవుడ్‌ లో సన్నాహాలు జరుగుతున్నాయి.

సాధారణ బస్ కండక్టర్ స్థాయి నుంచి కోట్లాది మందిక ఆరాధ్య దైవంగా ఎదిగిన ఆయన జీవన క్రమాన్ని అందులో చూపించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను సల్మాన్‌ ఖాన్‌ బావ అతుల్‌ అగ్నిహోత్రి నిర్మించే ప్రయత్నంలో ఉన్నట్లు వినికిడి. అతని స్నేహితుడు లాయ్డ్‌ ఇప్పటికే కథా చర్చల్లో నిమఘ్నమయ్యారు. త్వరలో రజనీకాంత్‌ ను కలిసి మరిన్ని వివరాలు సేకరించనున్నారు. అయితే అందుకు రజనీకాంత్ ఒప్పుకొన్నా కుటుంబ సభ్యులు అంగీకరించడం లేదని బోగట్టా.....

రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణరావ్ అవసరమైనప్పుడు మాత్రమే నోరు విప్పుతుంటారు. తన సోదరుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని హిందీలో సల్మాన్ ఖాన్ ఓ సినిమా చేయబోతున్నాడని విని, సత్యనారాయణ రావ్ ఆగ్రహం చెందారు. నా తమ్ముడి జీవితాన్ని వెండితెరకెక్కిండే హక్కు ఎవరికీ లేదు. పైగా వ్యక్తిగత జీవితాన్ని అస్సలు టచ్ చేయకూడదు. ఒకవేళ రజనీకాంత్ చరిత్రను సినిమాగా తీయాలంటే అది మేమే చేస్తాం. మరొకరకికి ఆ అవకాశం ఇవ్వము. అందుకని రజనీ చరిత్రను తెరకెక్కించాలని ఎవరూ ప్రయత్నించొద్దు అని సత్యనారాయణ రావ్ అన్నారు. మరి సల్మాన్ కి క రజనీ అయ్యే అవకాశం ఉందో లేదో వేచి చూడాల్సిందే...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X