‘కాలా’ టిక్కెట్టు దొరకలేదని అభిమాని మృతి
రజనీకాంత్ మూవీ 'కాలా' ఓ అభిమాని మరణానికి కారణమైంది. సూపర్ స్టార్ వీరాభిమాని ఒకరు టిక్కెట్టు దొరకలేదని మనస్తాపంతో మృతి చెందారు. తమిళనాడులోని తేని జిల్లా బోడిలో ఈ ఘటన చోటు చేసుకుంది.

కూలీపని చేసుకునే కుమరేశన్‌రజనీకాంత్‌కు వీరాభిమాని. 'కాలా' విడుదలైన తర్వాత సినిమా చూసేందుకు థియేటర్ వద్దకు వెళ్లాడు. ఎంత ప్రయత్నించినా టిక్కెట్టు దొరక్కపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురై మరణించారు.
టిక్కెట్టు దొరకలేదని ఇంటికి వచ్చి కుమరేశన్ తీవ్రంగా బాధ పడుతూ స్పృహకోల్పోగా వెంటనే అతడిని కుటుంబ సభ్యుు తేని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కుమరేషన్ మృతి చెందాడు.


Click it and Unblock the Notifications











