నేల మీద అన్నం పోసుకుని.. రజనీ కోసం మధురైలో ఫ్యాన్స్, ఇంత అభిమానమా!

Recommended Video

Rajinikanth Fans Eat Man Soru In Madurai | Filmibeat Telugu

సూపర్ స్టార్ రజనీకాంత్ కోసం దేశవ్యాప్తంగా వెర్రెత్తిపోయే అభిమానులు ఉన్నారు. రజని స్టైల్, సింప్లిసిటీ అభిమానులకు విపరీతంగా నచ్చుతుంది. రజనీపై ఫ్యాన్స్ ఎలాంటి ప్రేమని చూపిస్తారో మరోమారు రుజువైంది. నేడు శంకర్ తెరకెక్కించిన 2.0 చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. అన్ని ఏరియాల నుంచి ఈ చిత్రానికి మంచి స్పందన వస్తోంది. గత రాత్రి నుంచే థియేటర్స్ వద్ద అభిమానుల కోలాహలం మొదలయింది. తమిళనాడులో అయితే రజని ఫ్యాన్స్ హద్దులే దాటే అభిమానాన్ని చూపిస్తున్నారు.

 శంకర్ దర్శత్వంలో

శంకర్ దర్శత్వంలో

దిగ్గజ దర్శకుడు శంకర్ రూపొందించిన ఈ చిత్రం కోసం అభిమానులు చాలా రోజులుగా ఎదురుచూస్తున్నారు. పలుమార్లు ఈ చిత్రం వాయిదా పడినా క్రేజ్ మాత్రం తగ్గలేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుండడం, సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటిస్తుండడంతో అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. ముఖ్యంగా అక్షయ్ కుమార్, రజని మధ్య సాగే పోరాటాలు, విజువల్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

 రజనీకాంత్ కోసం

రజనీకాంత్ కోసం

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే.. కాలేజీలు, ఆఫీసులు ఖాళీగా మారుతాయి. కొన్ని కంపెనీలు తమ ఉద్యోగులకు నేడు సెలవు ప్రకటించింది. సినిమా విజయం సాధించడం కోసం కొందరు రజని అభిమానులు పూజలు నిర్వహించారు. థియేటర్స్ వద్ద పాలాభిషేకాలు, కటౌట్లు లాంటి హంగామా ఎప్పుడూ జరిగేదే.

మధురైలో ఆశ్చర్యపరిచిన అభిమానం

మధురైలో ఆశ్చర్యపరిచిన అభిమానం

మధురైలో కొందరు రజనీకాంత్ అభిమానులు ఆశ్చర్యపరిచారు. 2.0 చిత్రం విజయవంతం కావాలని ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆపై నేలమీద అన్నం వేసుకుని భోజనం చేశారు. ఇది తమిళనాడులో తరచుగా జరిగే సాంప్రదాయమే. తమ కోరికలు నెరవేరడం కోసం భక్తులు ఆలయాల్లో పూజలు నిర్వహించి ఎలాంటి పళ్లెం, ఆకు లేకుండా నేలపై అన్నం వేసుకుని తింటారు. రజనీకాంత్ అభిమానులు 2.0 కోసం ఇలా చేయడంతో వైరల్ గా మారింది.

త్రీడి ఫార్మాట్

త్రీడి ఫార్మాట్

ఇక 600 కోట్ల భారీ బడ్జెట్ లో రూపొందించిన ఈ చిత్రానికి మంచి స్పందనే వస్తోంది. బడ్జెట్ లో ఎక్కువ భాగం గ్రాఫిక్స్ వర్క్ కోసమే ఖర్చు అయింది. చిట్టి రోబోగా రజని, పక్షి రాజుగా అక్షయ్ కుమార్ చేసే విన్యాసాలు ఆకట్టుకుంటున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం ఏమేరకు రాణిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X