దేశవ్యాప్తంగా 2.0 ఫీవర్.. ముంబైలో 69 అడుగుల రజని విగ్రహం, తెల్లవారు జాము నుంచే!
సూపర్ స్టార్ రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన 2.0 చిత్రం నవంబర్ 29 గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధం అయింది. శంకర్ దర్శకత్వంలో విజువల్ వండర్‌గా రూపొందిన ఈ చిత్రం విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. విడుదలకు రెండు రోజుల సమయం మాత్రమే ఉండడంతో దేశవ్యాప్తంగా 2.0 ఫీవర్ మొదలైంది. ఎక్కడ చూసిన 2.0 పేరు వినిపిస్తోంది. రజనీకాంత్ కు అన్ని రాష్టాల్లోనూ అభిమాన సంఘాలు ఉన్నాయి. ఎవరికి తోచిన విధంగా వారు 2.0 రిలీజ్ సెలెబ్రేషన్స్‌కు రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర రజని అభిమానుల సంఘం మాత్రం భారీ స్థాయిలో రిలీజ్ సెలెబ్రేషన్స్ నిర్వహించనుంది.

69 అడుగుల భారీ విగ్రహం
ముంబైలోని రజనికాంత్ అభిమానులు నవంబర్ 29న పివిఆర్ సియోన్ థియేటర్ వద్ద 69 అడుగుల రజని భారీ స్టాచ్యూని చేయబోతున్నారు. ఈ మేరకు మహారాష్ట్ర రజని అభిమాన సంఘం నాయకుడు ఓ ఇంటర్వ్యూలో వివరించాడు. ఆరోజు తెల్లవారు జామున 4 గంటల నుంచే సెలెబ్రేషన్స్ మొదలవుతాయని చెబుతున్నారు.

తమిళ సాంప్రదాయ కార్యక్రమాలు
థియేటర్ వద్దే భారీ ఎత్తున తమిళ సాంప్రదాయ కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. థియేటర్ వరకు అభిమానులంతా ర్యాలీగా వెళుతామని చెబుతున్నారు. తమిళనాడు సాంప్రదాయ నృత్యంతో డాన్స్ ప్రోగ్రాం కూడా ప్లాన్ చేశారు. దర్శకుడు శంకర్ మొబైల్ ఫోన్లకు బానిస కావడం అనే అద్భుతమైన కాన్సెప్ట్ తో రూపొందించినట్లు తెలుస్తోంది.

600 కోట్ల బడ్జెట్‌తో అద్భుత విజువల్స్
ఈ చిత్రంలో చిట్టి రోబోగా రజనీకాంత్, సూపర్ విలన్ గా అక్షయ్ కుమార్ మధ్య పోరాట సన్నివేశాలు కళ్ళు చెదిరే విధంగా ఉండబోతున్నాయి. ఊహకందని విజువల్స్‌తో గొప్ప అనుభూతి కలిగేలా చిత్రాన్ని రూపొందించినట్లు శంకర్ తెలిపారు. విజువల్స్ బావుండడం కోడం బడ్జెట్ పెరుగుతున్నా వెనకడుగు వేయలేదని శంకర్ 2.0 ప్రమోషన్స్‌లో వెల్లడించాడు. దాదాపు 600 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి ఖర్చు చేశారు.

అమీ జాక్సన్
ఈ చిత్రంలో హీరోయిన్‌గా అమీజాక్సన్ నటించింది. ఈ అందాల బ్రిటిష్ భామ కూడా రోబో గెటప్‌లో యాక్షన్ సీన్స్‌తో అదరగొట్టబోతోంది. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ భారీ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. టీజర్, ట్రైలర్ పెంచిన ఆసక్తితో అభిమానులంతా నవంబర్ 29 కోసం ఎదురుచూస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదిరిపోయే రేంజ్‌లో ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఈ చిత్ర వసూళ్లు సునామీని తలపించేలా ఉండబోతున్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Click it and Unblock the Notifications











