రజనీకాంత్ క్రేజ్... ‘పేట’ రిలీజ్ సందర్భంగా థియేటర్లో అభిమాని వివాహం!
Recommended Video

తమిళనాడులో రజనీకాంత్ సినిమా విడుదలవుతుందంటే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన హీరో విడుదల రోజును ఫ్యాన్స్ పండగలా సెలబ్రేట్ చేసుకుంటారు. వివిధ రూపాల్లో తమ అభిమానం ప్రదర్శించుకునే ప్రయత్నం చేస్తారు.
తాజాగా 'పేట' రిలీజ్ సందర్భంగా ఓ ఫ్యాన్ ఏకంగా తన వివాహాన్నే థియేటర్లో జరుపుకోవడం చర్చనీయాంశం అయింది. చెన్నైలోని ఉడ్‌లాండ్ థియేటర్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు.

ప్రేక్షకులే అతిథులయ్యారు
‘పేట' మూవీ ప్రదర్శింపబడుతున్న థియేటర్లో వివాహం జరుగడంతో సినిమా చూడటానికి వచ్చిన ప్రేక్షకులే అతిథులయ్యారు. వారికి వివాహ విందు కూడా ఏర్పాటు చేశారు. సినిమా చూసి, దంపతులను ఆశీర్వదించి విందు ఆరగించి వెళ్లడం ఒక విభిన్నమైన అనుభూతిగా సినిమా చూడటానికి వచ్చిన వారి నుంచి వినిపించిన మాట.
ఇలాంటి వింతలన్నీ తమిళనాడులోనే...
సినిమాలను, హీరోలను అభిమానించే వ్యక్తులు ప్రతి చోటా ఉంటారు కానీ... తమిళనాడులో అభిమానుల తీరేవేరు. వారు అభిమానించడం మొదలు పెడితే అది తారాస్థాయిలో ఉంటుంది. కొన్ని సార్లు వారు చూపించే అభిమానం తట్టుకోవడం కష్టమై హీరోలు కూడా ఇబ్బంది పడుతుంటారు.

రజనీకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్
తమిళనాడులో ‘పేట' సినిమా విడుదల సందర్భంగా అభిమానులు భారీ కటౌట్లు, ఫ్లెక్సీలతో థియేటర్లను ముస్తాబు చేశారు. కొన్ని చోట్ల రజనీకాంత్, అజిత్ అభిమానుల మధ్య గొడవలు జరిగిన సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.

పేట
‘పేట' చిత్రానికి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. రజనీకాంత్‌తో పాటు విజయ్ సేతుపతి, శశికుమార్, సిమ్రన్, త్రిష, మెహ్రీన్, బాబీ సింహ, గురు సమసుందరన్ ముఖ్య పాత్రలు పోషించారు. బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ విలన్ పాత్రలో నటించాడు.


Click it and Unblock the Notifications











