నైట్ కర్ఫ్యూలో షూటింగ్ చేస్తున్న ఒకే ఒక్క హీరో.. ఆయన కోసమే స్పెషల్ పర్మిషన్
దేశవ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. రోజుకు లక్షల్లో పాజిటివ్ కేసులు వేలల్లో మరణాలు సంభవిస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదు. ఇక తెలంగాణాలో నైట్ కర్ఫ్యూని అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక షూటింగ్స్ కు ఇబ్బంది కలగడంతో ఒక్క హీరో సినిమాకు మాత్రం స్పెషల్ గా పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్.

ఏ మాత్రం తగ్గడం లేదు
దేశం నలువైపులా కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది తగ్గుముఖం పడుతుందని అనుకుంటే వైరస్ విజృంభన ఏ మాత్రం తగ్గడం లేదు. ఇక సినిమా ఇండస్ట్రీలకి కూడా కరోనా దెబ్బ గట్టిగానే పడింది. ఇప్పటికే కొంతమంది నటీనటులు కరోనా బారిన పడ్డారు. దీంతో చాలా షూటింగ్స్ ఆగిపోవడంతో సినీ కార్మికులకు పని లేకుండా పోయింది.

నైట్ షూటింగ్స్ పై ఇంట్రెస్ట్ చూపలేదు.
అయితే కొన్ని పెద్ద సినిమాలు మాత్రం ఇంకా షూటింగ్స్ ను కొనసాగిస్తూనే ఉన్నాయి. రిలీజ్ డేట్స్ ఎనౌన్స్ చేయడంతో వీలైనంత త్వరగా షూటింగ్ పనులను ముగించుకోవలని అనుకుంటున్నారు. సగంలో ఉన్న షూటింగ్స్ ను ఏ మాత్రం అపకూడదని ప్రభుత్వాలు కూడా స్పెషల్ గా అనుమతులు ఇస్తున్నాయి. ఇక తెలంగాణాలో అయితే ఇప్పటివరకు ఎవరు కూడా నైట్ షూటింగ్స్ పై ఇంట్రెస్ట్ చూపలేదు.

రామోజీ ఫిల్మ్ సిటీలో రజనీకాంత్
కానీ ఒకే ఒక్క హీరోకు సంబంధించిన షూటింగ్ తప్పనిసరిగా చేయాల్సి ఉండడంతో నిర్మాతలు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఆ స్టార్ హీరో మరెవరో కాదు. సూపర్ స్టార్ రజనీకాంత్. ఆయన నటిస్తున్న అన్నత్తే సినిమా షూటింగ్ గత కొన్నిరోజులుగా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోంది.
Recommended Video

ప్రత్యేకంగా అనుమతులు
సినిమా కోసం భారీ సెట్స్ నిర్మించిన చిత్ర యూనిట్ శరవేగంగా షూటింగ్ పనులను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యింది. అయితే తెలంగాణలో నైట్ కర్ఫ్యూ వల్ల షూటింగ్ కు బ్రేక్ రావడంతో మళ్ళీ నిర్మాతలు ప్రత్యేకంగా అనుమతులు తీసుకొని షూటింగ్ స్టార్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాను ఈ ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











