నయనతార పై రజినీకాంత్ ఫైర్.. ప్రియుడి విషయంలో నయన్ అప్‌సెట్

దక్షిణాది హీరోయిన్లలోకెల్లా భారీ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ నయనతార. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో పలు సినిమాలు చేసిన ఈ సీనియర్ భామ దాదాపు అందరు అగ్ర హీరోలతో చిందులేసి యమ డిమాండ్ క్రియేట్ చేసుకుంది. కేవలం సినిమాలే గాక షికార్లు, ప్రేమ వ్యవహారాల్లో కూడా అమ్మడు చాలా స్పీడ్. గతంలో ప్రభుదేవాతో చెట్టాపట్టాలేసుకు తిరిగిన ఈమె.. ఆ తర్వాత అతనికి బ్రేకప్ చెప్పేసి తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ వెంట తిరుగుతోంది. అయితే ఈ ఇద్దరి విషయంలో తాజాగా రజినీకాంత్ జోక్యం చేసుకొని నయన్ ని మందలిచారనే వార్త ఫిలిం సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాట తన తర్వాత అదే రేంజ్‌లో పాపులారిటీ కొట్టేసి లేడీ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్న నయనతార అంటే రజినీకాంత్‌కు ప్రత్యేకమైన గౌరవం. అలాంటిది నయన్ ప్రియుడి విషయమై రజనీకాంత్ ఆమెపై సీరియస్ అయ్యారని తెలిసి ఆశ్చర్యపోతున్నారు ప్రేక్షకులు. ప్రస్తుతం దర్బార్ సినిమాలో కలిసి నటిస్తున్నారు నయన్, రజినీకాంత్.

Rajinikanth Fires On Nayantharas Behaviour

ఈ నేపథ్యంలో నయనతార తన బోయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్‌ను దర్బార్ షూటింగ్ సెట్లో రజనీ కు పరిచయం చేసింది. అంతేకాదు విఘ్నేష్ శివన్‌ దర్శకత్వంలో మీరు సినిమా తీయాలని అభ్యర్థన కూడా పెట్టింది. దీనికి తలైవా మాత్రం చూద్దాం! మంచి కథ ఉంటే పట్టుకురా అని చెప్పారట. ఇక ఆగని నయన్.. విఘ్నేష్ మంచి దర్శకుడు అంటూ రజనీకు ఖాళీ దొరికినప్పుడల్లా అడగడం మొదలెట్టిందట. దీంతో చిరాకు చెందిన రజినీకాంత్ నయన్ ని సున్నితంగా మందలిచారని సమాచారం.

ప్రొఫెషనల్ విషయాల్లోకి పర్సనల్ లైఫ్ ని తేవద్దని నయనతారతో రజినీ అన్నారని తెలుస్తోంది. నాకు అంతగా విఘ్నేష్ తో సినిమా చెయ్యాలనిపిస్తే పిలిపించి చేస్తాను. అంతేగానీ ఎవరి రికమండేషన్ అవసరం లేదుంటూ నయనతారపై కురిపించారట రజినీ. అయితే రజినీకాంత్ మాటలతో నయనతార బాగనే ఫీలైనట్టు కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ రకంగా ప్రియుడి విషయంలో నయన్ అప్‌సెట్ అయిందని కోలీవుడ్ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X