3గంటల పాటు ‘రా.వన్’ షూటింగ్ లో పాల్లొన్నరజనీకాంత్..!
హిందీలో షారుక్ ఖాన్ నటించి, నిర్మిస్తున్న 'రా.వన్" చిత్రంలో రజనీకాంత్ ఓ గెస్ట్ రోల్ చేయబోతున్నారనే వార్త వచ్చింది. ఈ చిత్రంలో షారుక్, చిత్రకథానా యిక కరీనాకపూర్ ని కాపాడే సీన్ లో రజనీ నటిస్తారని తెలిసింది. అయితే ఇంకా రజనీ కోలుకోలేదని, అందుకని 'రా.వన్"లో నటించరని ఓ వార్త వచ్చింది. ఈ కారణంగా రజనీ పోలికలు ఉన్న వ్యక్తితో షారుక్ ఈ సన్నివేశాన్ని చిత్రీకరించాల నుకుంటున్నారని కూడా బాలీవుడ్ వర్గాలు అన్నాయి. కానీ ఆ వార్తను అబద్ధం చేస్తూ.. రజనీకాంత్ ఈ చిత్రంలో నటించారు.
ఈ విషయాన్ని స్వయంగా షారుక్ ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ముందుగా ఈ షూటింగ్ ని హైదరాబాద్ లో చేయాలనుకున్నారట. కానీ కొన్ని కారణాల వల్ల చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకుని, ముంబయ్ లోని 'విజ్లింగ్ ఉడ్స్ స్టూడియో"లో ఈ చిత్రీకరణ జరిగిందని షారుక్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. దాదాపు మూడు గంటలపాటు ఈ చిత్రీకరణ జరిగిందట. షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో షారుఖ్ హీరో కాగా, అతని భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్‌లలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
కాగా రోబో సినిమా తర్వాత రజనీ వెండి తెరపై కనిపించ లేదు. రాణా సినిమా షూటింగ్ మొదలైన రోజే ఆయన అనారోగ్యానికి గురయి చాలా రోజులు ఆసుపత్రికే పరిమితం అయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో రాణా షూటింగ్ అటకెక్కింది. ఈ తరుణంలో రానా సినిమా కంటే ముందే(రా.వన్ విడుదల తేది 26.10.11) తమ అభిమాన నటుడు రజనీ వెండి తెరపై తళుక్కుమనే అవకాశం రావడంతో అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది.


Click it and Unblock the Notifications











