రజినీకాంత్‌కు కోవిడ్ టెన్షన్: ఆ ఒక్కడికే పర్మీషన్.. ఆయన తీసుకునే జాగ్రత్తలివే
కరోనా రెండో దశ రోజు రోజుకూ ఉధృతం అవుతోంది. దీంతో దేశ వ్యాప్తంగా ప్రతి రాష్ట్రంలోనూ వేల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. అదే సమయంలో చాలా మంది ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ సారి కరోనా వైరస్ ప్రభావం చిత్ర సీమపై కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో సినిమా షూటింగులు అన్నీ నిలిచిపోయాయి. తెలుగులో ఒకటి రెండు చిత్రాలు మినహా మిగిలినవి అన్నీ ఆగిపోయాయి. కానీ, సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం హైదరాబాద్‌లోనే షూటింగ్ జరుపుకుంటున్నారు.
ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్.. మాస్ డైరెక్టర్ శివ దర్శకత్వంలో 'అన్నత్తే' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. ఈ నేపథ్యంలో కరోనా బారిన పడకుండా రజినీకాంత్ తీసుకునే జాగ్రత్తల గురించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. ఈ సినిమా సెట్స్‌లో ఆయన దర్శకుడు శివతో తప్ప ఎవరితోనూ మాట్లాడడని రూల్ పెట్టారట. అది కూడా నాలుగు అడుగుల దూరం నుంచే అని తెలిసింది. అలాగే, ఒక్కడే అసిస్టెంట్ కమ్ మేకప్ మ్యాన్ ఉండాలని కూడా ఆదేశించినట్లు తెలిసింది.

వ్యక్తిగత సిబ్బందిని కూడా ఈ షెడ్యూల్‌లో దూరం పెట్టారన రజినీకాంత్. అలాగే, సామాజిక దూరంతో పాటు శానిటైజేషన్ కూడా రెగ్యూలర్‌గా జరగాలని సూచించారట. ఇవన్నీ సక్రమంగా జరిగితేనే షూటింగ్ జరుపుదాం అని స్క్రిక్ట్ వార్నింగ్ ఇవ్వడం వల్లే చిత్రీకరణ కొనసాగుతోందని సమాచారం. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. ఇందులో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.


Click it and Unblock the Notifications











