Don't Miss!
- Lifestyle చాణక్య నీతి ప్రకారం, ఈ అలవాట్లు మీకు తెలియకుండానే మీ సంపదను పూర్తిగా నాశనం చేస్తాయి...!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సూపర్ స్టార్‌ని చుట్టుముట్టిన అభిమానులు.. పోలీసులు ఏం చేశారో చూడండి!
సూపర్ స్టార్ రజనికాంత్ ప్రస్తుతం పెట్ట చిత్రంలో నటిస్తున్నాడు. ప్రతిభ గల కార్తీక్ సుబ్బరాజ్ దర్శత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. పెట్ట చిత్ర ఫస్ట్ లుక్ ఇటీవల విడుదలయింది. రజనీకాంత్ ఈ చిత్రంలో కుర్రాడిలా కనిపిస్తుండడం విశేషం. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లక్నోలో జరుగుతోంది.రజనీకాంత్ కు దేశవ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో అందరికి తెలిసిందే. సూపర్ స్టార్ ఎక్కడకు వెళ్లినా భారీ బందబస్తు అవసరం. లక్నో షూటింగ్ లో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
పోల్: బిగ్‌బాస్ తెలుగు 2 విజేతను మీరే తేల్చేయండి.. మీ ఓటు వేసేందుకు లింక్ క్లిక్ చేయండి!
చుట్టుముట్టిన అభిమానులు
సూపర్ స్టార్ ని ఒక్కసారి చూస్తే చాలనుకునే అభిమానులు కోట్లల్లో ఉన్నారు. లక్నోలో కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్ర కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ సందర్భంగా పోలీసులకు తిప్పల తప్పడం లేదు. భారీ ఎత్తున అభిమానులు చుట్టు ముట్టడంతో రజనీకాంత్ ని తరలించడానికి పోలీసులు నానా తంటాలు పడవలసి వచ్చింది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుర్రాడిలా మారిపోయిన సూపర్ స్టార్
ఈ చిత్రంలో రజనీకాంత్ కుర్రాడిలా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ లో రజని సూపర్ స్టైలిష్ గా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజగా షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఫొటోల్లో రజని అదరగొడుతున్నాడు. రజినీకాంత హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ మరో లెవల్లో ఉన్నాయి.
క్రేజీ హీరోయిన్లు
ఈ చిత్రంలో రజని సరసన క్రేజీ హీరోయిన్లు నటిస్తున్నారు. అందాల త్రిష తొలిసారి సూపర్ స్టార్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది. యువత కలల రాణి సిమ్రాన్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి, నవాజుద్దీన్ సిద్దిఖీ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
త్వరలో పార్టీ
ఇదిలా ఉండగా మరోమారు రజనీకాంత్ రాజకీయాలపై వాడీ వేడి చర్చ మొదలైంది. రాజకీయాల్లోకి వస్తున్నానని ఇప్పటికే రజనీకాంత్ ప్రకటించారు. ఈ డిసెంబర్ లోనే రజని కొత్త రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు తమిళనాడులో జోరుగా చర్చ మొదలయింది. పెట్ట చిత్రం తరువాత మురుగదాస్ దర్శత్వంలో రూపొందే సినిమానే రజని ఆఖరి చిత్రం అనే ఊహాగానాలు మొదలయ్యాయి.