త్రీ...సినిమా బాధితులకు ఊరట!

By Bojja Kumar

ధనుష్ హీరోగా, రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో రూపొందిన 'త్రీ' సినిమా అటు తమిళనాటనే కాకుండా తెలుగునాట కూడా పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కొలవెరి సాంగు భారీ విజయం సాధించడంతో సినిమా కూడా బాగా ఆడుతుందని భావించి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఈ చిత్రాన్ని భారీ మొత్తం చెల్లించి దక్కించుకుని నష్టపోయారు. తెలుగులో ఈచిత్రం హక్కులు దక్కించుకున్న నిర్మాత నట్టి కుమార్ కోట్లలో జేబుకు చిల్లు పడింది.

దీంతో చిత్ర దర్శకురాలు ఐశ్వర్య నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లను ఆదుకునేందుకు సిద్ధం అయ్యారు. తన సినిమాలు పరాజయం పాలైనప్పుడు నిర్మాతను, పంపిణీదారుడిని పిలిచి మరి డబ్బులు వాసప్‌ ఇచ్చి ఆదుకున్న సహృదయుడు రజనీ‌. ఆమధ్య 'కుచేలన్‌' సినిమా విషయంలో ఆయన ఇలానే చేశారు. ఇప్పుడు తన కూతురు, అల్లుడు తీసిన 'త్రీ' సినిమా కారణంగా నష్టపోయిన వారి పట్ల తన పెద్ద మనసును ప్రదర్శించబోతున్నారు.

తండ్రి రజనీకాంత్‌ సలహా మేరకు నష్టపోయినవారికి కొంత సాయం చేసేందుకు హామీ ఐశ్వర్య ఇచ్చినట్లు తెలుగు డబ్బింగ్‌ హక్కులు పొందిన నట్టికుమార్‌ ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు సమాచారం.

'కొలవెరి డి...'పాటతో రిలీజ్ కు ముందే విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న 'త్రీ' తెలుగులోనూ అట్టహాసంగానే విడుదలైంది. ధనుష్ భార్య ఐశ్వర్య దర్సకురాలిగా పరిచయమతూ చేసిన ఈ చిత్రం అంచనాలకు ఆమడ దూరంలోనే ఉండిపోయింది. ఫస్టాఫ్ చక్కటి ప్రేమకథను ఆవిష్కరించిన ఈ చిత్రం సెకండాఫ్ లో హఠాత్తుగా మాయరోగాన్ని రంగంలోకి దింపి ప్రేక్షకులను సహన పరీక్ష పెట్టింది. తొలి రోజే సినిమా నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో సినిమాకు కలెక్షన్లు కరువయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X