SRH కావ్య మారన్ పరిస్థితి చూస్తే బీపీ పెరిగిపోతుంది.. జైలర్ ఈవెంట్‌లో రజనీకాంత్ కామెంట్స్ వైరల్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ చిత్రం విడుదలకు ముందే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నది. తమన్నా భాటియా, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివ రాజ్‌కుమార్ నటించిన ఈ చిత్రం దక్షిణాదిలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్లో అంచనాలు పెంచింది. తమిళనాడులో ప్రఖ్యాత సినీ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మించిన సినిమా ఫంక్షన్ ఇటీవల చెన్నైలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఐపీఎల్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు యజమాని కావ్య మారన్‌ను గురించి రజనీకాంత్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. తలైవా చేసిన కామెంట్స్ ఏమిటంటే..
ఐపీఎల్ జట్టుతో కావ్య మారన్:హైదరాబాద్‌కు చెందిన సన్‌రైజర్స్ జట్టును తమిళనాడులో భారీ పారిశ్రామిక వర్గం సన్ గ్రూప్ కొనుగోలు చేసింది. ఐపీఎల్ పోటీల్లో కొన్ని సంవత్సరాలుగా పాల్గొంటున్నది. ఈ జట్టుకు ఓనర్‌గా కావ్య మారన్ కీలక పాత్ర పోషిస్తున్నది. జట్టులో సమతుల్యం ఉండేలా తన వంతుగా కృషి చేస్తున్నది. ప్రతీ మ్యాచ్‌లోను తన జట్టు ఆటగాళ్లకు పోత్సాహం ఇస్తూ కనిపిస్తుంటుంది.

సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా కావ్య:ఐపీఎల్ సీజన్‌లో జరిగే ప్రతీ మ్యాచ్‌లో ప్రేక్షకులను, గ్రౌండ్‌లోని కెమెరాలను తనవైపుకు తిప్పుకోవడంలో కావ్య దిట్ట. మ్యాచ్ జరుగుతున్నప్పుడు కావ్య వ్యక్తం చేసే హావభావాలు క్రీడాభిమానులను విశేషంగా ఆకట్టుకొంటాయి. ప్రతీ మ్యాచ్‌లో కావ్య మీడియాలో హెడ్‌లైన్‌గా కనిపిస్తుంటుంది. ఆటగాళ్ల కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో ఆమె ట్రెండ్ అవుతుంటుంది.

నేషనల్ క్రష్‌గా కావ్య మారన్:ఇక కావ్య మారన్ అందం, చదువుల్లో కూడా టాప్ గేర్‌లో కొనసాగుతున్నారు. కళానిధి మారన్, కావేరి మారన్ కుమార్తె అయిన ఆమె ఎంబీఏ పూర్తి చేసింది. కుటుంబానికి చెందిన వ్యాపారాల్లో చురుకుగా పాల్గొంటుంది. దాదాపు ఐపీఎల్ టీమ్ వ్యవహారాలను స్వయంగా కావ్య చూస్తుంటుంది. బిజినెస్ వ్యవహారాల్లోనే కాకుండా అందంలోను నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకొంటుంది.

కావ్య మారన్ అసంతృప్తిగా :అయితే ఇంతటి గుణగణాలు ఉన్న కావ్య మాత్రం కొద్దికాలంగా అసంతృప్తిగా కనిపిస్తుంటుంది. ఐపీఎల్ పోటీలలో కావ్య తన జట్టు ఓడిపోయినప్పుడల్లా ముఖం అదోలా పెడుతూ బాధపడుతుంటుంది. తన జట్టు బాగా ఆడినప్పుడు ఆమె ముఖం వెలిగిపోతుంటుంది. కానీ గత ఐపీఎల్‌లో సన్ రైజర్ మాత్ర లీగ్ దశల్లోనే ఇంటి ముఖం పట్టింది. ఆ సమయంలో కావ్య బాధ వర్ణనాతీతమని చెప్పవచ్చు.

కావ్య మారన్ గురించి రజనీకాంత్:అయితే కావ్య మారన్ పడే బాధ గురించి జైలర్ ఫంక్షన్‌లో రజనీకాంత్ చెప్పిన మాటలు అందర్నీ నవ్వుల్లో ముంచెత్తాయి. కావ్య మారన్ గురించి మాట్లాడుతూ.. వచ్చే ఏడాది సన్ రైజర్స్‌కు మంచి టీమ్‌ను, ఆటగాళ్లను ఇవ్వండి. ఎస్ఆర్‌హెచ్ (SRH) మ్యాచ్‌ల సందర్భంగా కావ్య హావభావాలు, ఎక్స్‌ప్రెషన్స్ చూస్తే మనకే బీపీ పెరిగిపోయి గుండెదడ పుట్టేలా ఉంది అంటూ రజనీకాంత్ సెటైర్ వేశారు.

రజనీకాంత్ కామెంట్స్ వైరల్:దాంతో జైలర్ వేడుకలో రజనీ మాటలు విన్న అందరూ గొల్లుమని నవ్వుకొన్నారు. రజనీకాంత్ మాటలు విన్న తర్వాత వచ్చే ఐపీఎల్‌లో కావ్య ముఖంలో వెలుగులు నింపడానికి యాజమాన్యం ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందో వేచి చూడాల్సిందే. ఈ మాటలు విన్న కళానిధి మారన్ కూడా స్వయంగా నవ్వుల్లో మునిగిపోయారు. ప్రస్తుతం రజనీకాంత్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.


Click it and Unblock the Notifications











