రజనీ, నేను 3డి కెమెరాల్లాంటి వాళ్లం: కమల్ హాసన్
హైదరాబాద్: తమిళ సినీ పరిశ్రమలో బెస్ట్ ఫ్రెండ్స్ మరియు సమ ఉజ్జీలయిన పోటీ దారులు రజనీకాంత్, కమల్ హాసన్. ఈ విషయాన్ని ఇద్దరు నటులు అనేక సందర్భాల్లో ఒప్పుకున్నారు కూడా. తాజాగా మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు కమల్ హాసన్.
బాలీవుడ్ స్టార్ల మాదిరి కమల్ హాసన్, రజనీకాంత్ మధ్య కోట్లాటలు, మనస్పర్థలు ఇప్పటి వరకు రాలేదు అంటే ఆశ్చర్యమే మరి. ఇప్పటికీ వీరి మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీ వాతావరణం కొనసాగుతోంది. ఎంత పోటీ ఉన్నప్పటికీ ఇద్దరూ ఒకరికొకరు గౌరవం ఇచ్చుకుంటూ ఉంటారు. ఇద్దరూ కలిసి ఒకేసారి కెరీర్ ప్రారంభించారు. అనేక సినిమాల్లో కలిసి నటించారు. ఆ తర్వాత కమర్షియల్ కారణాలతో ఇద్దరూ కలిసి నటించడం మానేసారు.
తాజాగా తన 'విశ్వరూపం' సినిమా విడుదల సందర్భంగా కమల్ హాసన్ ఓ నేషనల్ న్యూస్ ఛానల్ తో మాట్లాడుతూ ఓ ప్రశ్నకు సమాధానంగా తమ మధ్య ఉన్న సంబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు. తమ మధ్య సామరస్య పూర్వకమైన గట్టి పోటీ వాతావరణం ఉందని ఒప్పుకున్నారు.
'మా ఇద్దరి మధ్య రిలేషన్ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీ లేదు. మా ఇద్దరి ఆలోచనలు ఎప్పుడూ ఏకీభావముతో ఉంటాయి. మేమిద్దరం 3డి కెమెరాల్లాంటి వాళ్లం. ఇద్దరం బాల చందర్ పర్యవేక్షణలో ఎదిగిన వాళ్లం. అదృష్ణ వశాత్తు మా ఇద్దరి మధ్య ఆరోగ్యకరమైన గట్టి పోటీ వాటావరణం ఉంది. అదే సమయంలో ఇద్దరం ఎప్పుడూ అన్నదమ్ములా ఉంటాం. అంతే కాకుండా ఎవరికి వారు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాం' అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు.

ఇద్దరం కలిసి 13 సినిమాల్లో నటించాం. ఇద్దరం కలిసి నటించడం వల్ల మా రెమ్యూనరేషణ్ నిర్మాతలకు భారం అయింది. అందుకే విడివిడిగా సినిమాలు చేయడం మొదలు పెట్టామని కమల్ చెప్పుకొచ్చారు.

తమ గురువు బాల చందర్. ఆయన వల్లే మేము ఈ స్థాయికి వచ్చామని కమల్ హాసన్ తెలిపారు.

రజనీకాంత్, కమల్ హాసన్ మళ్లీ కలిసి నటిస్తారనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నప్పటికీ ఇది సాధ్యమయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. ఆ మధ్య ఓ నిర్మాత ఇందుకోసం ప్రయత్నించి విఫలం అయ్యారు.

ఇద్దరూ ఇప్పటికీ ఎక్కడ కలుసుకున్నా...ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటారు.

కమల్ హాసన్ విశ్వరూపం సినిమా విషయానికొస్తే ఈ నెల 25న ఈచిత్రం గ్రాండ్ గా విడుదలవుతోంది.


Click it and Unblock the Notifications











