అరువి చూసి ఏడ్చాను.. రజనీ.. హీరోయిన్‌కు తలైవా అరుదైన గిఫ్ట్

By Rajababu

తమిళ చిత్రంలో తాజా సంచలనం అరువి. నక్సలైట్ అనే అనుమానంతో ఓ యువతిని పోలీసులు చిత్రహింసలకు గురిచూస్తూ సాగించే దర్యాప్తు నేపథ్యంగా విభిన్నమైన కథాంశంతో అరువి రూపొందింది. ఈ చిత్రాన్ని దర్శకుడు అరుణ్ ప్రభు తెరకెక్కించారు. అరువి అంటే జలపాతం అని అర్థం. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను అదితి బాలన్ పోషించారు. ఈ చిత్రంపై పలు ప్రధాన వెబ్‌సైట్లు అద్భుతమైన రేటింగ్ ఇచ్చాయి. అరువి చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్న నేపథ్యలో చిత్ర యూనిట్‌కు ఓ ఆసక్తికరమైన అనుభవం ఎదురైంది. అదేమిటంటే..

 అరువి టీమ్‌తో రజినీ

అరువి టీమ్‌తో రజినీ

అరువి చిత్రాన్ని ఇటీవల సూపర్‌స్టార్ రజనీకాంత్ వీక్షించారు. ఆ చిత్రం రజనీని విపరీతంగా ఆకట్టుకొన్నది. దాంతో ఈ చిత్ర యూనిట్‌ను తన నివాసానికి సాదారంగా ఆహ్వానించారు. వారితో 20 నిమిషాలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ సందర్భంగా హీరోయిన్ అదితి బాలన్, దర్శకుడిని, చిత్ర యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

 ఒంటరిగా కూర్చొని..

ఒంటరిగా కూర్చొని..

అరువి చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించావు. నేను ఆ చిత్రాన్ని చూసి కొత్త అనుభూతికి లోనయ్యాను. నేను ఒంటరిగా చేసినప్పటికీ.. కిక్కిరిసిన ప్రేక్షకుల మధ్య కూర్చొని చూసిన ఫీలింగ్ కలిగింది.

 అరువి చూసి ఏడ్చాను

అరువి చూసి ఏడ్చాను

అరువి చూసినంత సేపు నేను ఓ రకమైన భావోద్వేగానికి గురయ్యాను. కొన్నిసార్లు ఏడ్చాను. నవ్వాను. సినిమా వెంట భావోద్వేగంతో ప్రయాణించాను. అంత గొప్ప చిత్రాన్ని రూపొందించిన మీకు, చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలు అని దర్శకుడిపై రజనీ ప్రశంసల వర్షం కురిపించారు.

 అదితికి రజనీ ప్రశంస

అదితికి రజనీ ప్రశంస

అరువి చిత్ర హీరోయిన్‌ అదితిని ప్రత్యేకంగా పొగడ్తలతో ముంచెత్తాడు. పాత్ర కోసం పడిన తపన తనను విశేషంగా ఆకట్టుకొన్నది. పాత్ర కోసం చాలా బరువు తగ్గడం మామూలు విషయం కాదు అని అదితితో రజనీ అన్నారు.

 బంగారు గొలుసు కానుకగా

బంగారు గొలుసు కానుకగా

అరువి యూనిట్‌ను పొగడ్తలతో ముంచెత్తడమే కాకుండా చిత్రంలో హీరోయిన్‌గా నటించిన అదితి బాలన్‌, దర్శకుడు అరుణ్‌ ప్రభుకు బంగారం గొలుసును కానుకగా ఇచ్చారు. దీంతో అదితి, అరుణ్ సంతోషంలో మునిగి తేలుతున్నారు.

10 కిలోల బరువు తగ్గాను..

10 కిలోల బరువు తగ్గాను..

అరువి చిత్రానికి అనేక ప్రశంసలు అందుతున్న నేపథ్యంలో అదితి బాలన్ మీడియాతో ముచ్చటించారు. ఎయిడ్స్ రోగిగా నటించేందుకు దాదాపు 10 కేజీల బరువు తగ్గాను. క్లైమాక్స్ సీన్లు షూటింగ్ చేసే సమయంలో 45 రోజులు ఎవరితో మాట్లాడలేదు. అలా చేయడం వల్ల మానసికంగా, శారీరకంగా కుంగిపోయాను. అందుకే అరువి పాత్ర తెరపైన అంత గొప్పగా కనిపించింది అని అదితి బాలన్ అన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X