సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా లారెన్స్ గుడి!
కొరియోగ్రాఫర్ గా, దర్శకుడిగా, హీరోగా లారెన్స్ కోలీవుడ్, టాలీవుడ్ ల్లో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ప్రస్తుతం లారెన్స్ చెన్నైలోని అంబత్తూరులో రాఘవేంద్రస్వామి గుడిని కట్టించే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ గుడి పనులు పూర్తిగా కావచ్చాయట. దాంతో జనవరి 1వ తారీఖున సూపర్ స్టార్ రజనీకాంత్ చేతుల మీదుగా ఈ గుడి ప్రారంభోత్సవం జరగాలని లారెన్స్ అనుకుంటున్నాడట. ఇప్పటికే రజనీ దగ్గర లారెన్స్ ఈ ప్రపోజల్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇంకా రజనీ వైపు నుండి లారెన్స్ కు గ్రీన్ సిగ్నల్ రాలేదు. కానీ రజనీకాంత్ ఈ గుడి ప్రారంభోత్సవంలో తప్పకుండా పాల్గొంటాడని చెన్నై వర్గాలు అంటున్నాయి.
More from Filmibeat
రజనీకాంత్ లారెన్స్ రాఘవేంద్ర స్వామి అంబత్తూర్ రోబో rajinikanth lawrence raghavendra swamy ambattur robo


Click it and Unblock the Notifications











